Ram Charan Birthday: RC 15 సెట్‌లో సెలెబ్రేషన్స్.. ఇదేం క్రేజ్ రా బాబు.. రామ్ చరణ్ కోసం దిల్ రాజు ప్లానింగ్‌

Ram Charan Birthday రామ్ చరణ్‌ బర్త్ డే (మే 27) సందర్భంగా ఈ వీకెండ్ అంతా కూడా థియేటర్లో ఆరెంజ్ సందడి చేస్తోంది. ఆరెంజ్ సినిమాను స్పెషల్‌గా స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ని షోలు వేస్తే అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 10:29 AM IST
  • సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి
  • రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్ షురూ
  • దిల్ రాజు స్పెషల్ ప్లానింగ్
Ram Charan Birthday: RC 15 సెట్‌లో సెలెబ్రేషన్స్.. ఇదేం క్రేజ్ రా బాబు.. రామ్ చరణ్ కోసం దిల్ రాజు ప్లానింగ్‌

Ram Charan Birthday @RC 15 Set: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా సెలెబ్రేషన్స్ ఆల్రెడీ షురూ అయ్యాయి. ఆరెంజ్ సినిమాను ప్రత్యేకంగా ఈ వీకెండ్‌లో స్క్రీనింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్లో హంగామా చేస్తున్నారు. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాను నెవ్వర్ బిఫోర్ అన్నట్టుగా సెలెబ్రేట్ చేస్తున్నారు.

అయితే దిల్ రాజు మాత్రం నిన్న సినిమా సెట్‌లో రామ్ చరణ్‌ను ఆశ్చర్యపరిచినట్టుగా ఉంది. శంకర్ రామ్ చరణ్‌ కియారా అద్వాణి ప్రభు దేవాలు కలిసి శంషాబాద్ ఏరియాలో సాంగ్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సాంగ్ షూట్ పూర్తయిందట. 

ప్యాకప్ చెప్పిన తరువాత రామ్ చరణ్ కోసం స్పెషల్ అరెంజ్మెంట్స్ చేసినట్టుగా ఉంది. ఇక రామ్ చరణ్‌కు బర్త్ డే కంటే ముందే ఇలా సర్ ప్రైజ్ వచ్చినట్టు అయింది. అయితే రామ్ చరణ్‌తో పాటు శంకర్, కియారా అద్వాణీలు, ప్రభుదేవా కనిపించాడు. వీరితో పాటుగా గణేష్ మాస్టర్ కూడా కనిపించాడు.

 

అంటే ఈ పాట కోసం ప్రభుదేవాతో పాటుగా గణేష్ మాస్టర్ కూడా పని చేశాడా? అసలు శంకర్ ఈ పాటను ఎలా ప్లాన్ చేశాడు? బర్త్ డేకు ఎలాంటి ట్రీట్ ఇస్తాడంటూ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఇక దిల్ రాజు అయితే ఎప్పటి నుంచో అప్డేట్లను ఊరిస్తూ వస్తున్నాడు.

మేలుకో ఎస్వీసీ బ్యానర్ అంటూ గత కొన్ని రోజులుగా రామ్ చరణ్‌ ఫ్యాన్స్ దిల్ రాజును ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు రెడీ చేశారని, శంకర్ తన స్టైల్లో వీటిని ప్రమోట్ చేయనున్నాడని తెలుస్తోంది.

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News