Rohit Sharma Statement About India's Defeat: భారత్ పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయినా.. మొదటి వన్డేలో ఓటమి పాలైనా.. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చివరి రెండు వన్డేల్లో విజయం సాధించి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా.. చివరి రెండు వన్డేల్లో ఆసీస్ గెలుపొందింది. ఆఖరి మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కంగారూల సొంతమైంది.
ఈ ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓటమికి కారణాలు చెప్పాడు. ఆస్ట్రేలియా విధించిన టార్గెట్ చాలా ఎక్కువ అని తాను అనుకోవట్లేదన్నాడు. కానీ ఇక్కడ బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టమైందన్నాడు. తాము ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందన్నాడు. ఇలాంటి మ్యాచ్‌లలో మంచి భాగస్వామ్యం నెలకొల్పడం చాలా ముఖ్యమని.. కానీ తాము అలా చేయలేకపోయామన్నాడు. క్రీజ్‌లో కుదరుకుంటున్న సమయంలోనే వికెట్లు కోల్పోయాన్నాడు.
'మేం మొదటి నుంచి ఇలాంటి పరిస్థితుల్లోనే ఆడుతున్నాం.. మంచి ఆరంభం లభించిన తర్వాత ఒక బ్యాట్స్‌మెన్ అయినా గేమ్‌ను చివరి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే అది జరగలేదు. ఈ మ్యాచ్‌తోపాటు సిరీస్ గెలవడానికి మేం అందరం మా బెస్ట్ ఇచ్చాం. ఈ ఓటమి ఏ ఒక్కరో ఇద్దరు ఆటగాళ్ల వల్ల కాదు. నేను ఏ ఒక్క ఆటగాడిని, జట్టును నిందించను. ఈ సిరీస్ ఓటమిలో కూడా సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ మూడు వన్డేల ఆధారంగా మాత్రమే నేను నా జట్టు ప్రదర్శనను అంచనా వేయను. గత తొమ్మిది వన్డేల నుంచి మేం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఆ జట్టు ఇద్దరూ స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. సీమర్లు కూడా ఒత్తిడిని పెంచారు..' అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
చెన్నైలో జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు రాణించడంతో 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ మార్ష్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. అలెక్స్ కార్వీ 38, ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ తలో చేయి వేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 8 ఓవర్లలో 44 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
270 ఛేదించే క్రమంలో భారత్‌కు మంచి ఆరంభం దక్కినా.. చివరికి ఓటమి పాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(30), శుభ్‌మన్ గిల్ (37), కేఎల్ రాహుల్ (32), విరాట్ కోహ్లీ (54), హార్ధిక్ పాండ్యా (40) రాణించినా.. కీలక సమయాల్లో ఔట్ కావడంతో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4, అష్టన్ అగర్ 2, స్టోయినిస్, అబ్బాట్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read: Ind Vs Aus: ఫైనల్ ఫైట్‌లో ఆసీస్ హిట్.. భారత్ ఫ్లాప్ షో.. సిరీస్ కంగారూలదే..
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook