Ind Vs Aus 3rd Odi Updates: మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియా జట్టును భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ (47) అత్యధిక పరుగులు చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా తలో చేయి వేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బ తీశారు. 270 రన్స్ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ గెలిచింది. నిర్ణయాత్మక చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈసారి బ్యాటింగ్ చేసుందుకు మొగ్గు చూపాడు. గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే భారత్ బరిలోకి దిగగా.. ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. గ్రీన్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ను తుది జట్టులోకి తీసుకుంది.
మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా సెట్ అవ్వడంతో డేవిడ్ వార్నర్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించింది. వేగంగా ఆడిన మార్ష్-హెడ్ మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. 10.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఈ తరుణంలో హెడ్ (33)ను ఔట్ చేసి హర్ధిక్ పాండ్యా భారత్‌కు తొలి వికెట్ అందించాడు. కాసేపటికే స్టీవ్ స్మిత్ (0), మిచెట్ మార్ష్ (47) వికెట్లు తీసి మళ్లీ దెబ్బతీశాడు. డేవిడ్ వార్నర్ (23), లాబుషేన్ (28), స్టొయినిస్ (25), అలెక్స్ కార్వీ (38), సీన్ అబ్బాట్ (26) ఓ మాదిరి స్కోర్లు చేయడంతో వరుసగా విరామాల్లో వికెట్లు పడినా ఆసీస్ స్కోరు వేగం తగ్గలేదు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా తలో చేయి వేశారు. చివరకి 269 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది.
టాప్ ఆర్డర్‌ను హార్ధిక్ పాండ్యా దెబ్బతీయగా.. కుల్దీప్ యాదవ్ దెబ్బకు మిడిల్ ఆర్డర్ పెవిలియన్‌కు క్యూకట్టింది. పాండ్యా, కుల్దీప్ తలో మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ ఇబ్బంది పడగా.. ఇప్పుడు 270 పరుగుల లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.
Also Read: Loan Recovery Rules: లోన్ చెల్లించలేకపోతున్నారా..? రికవరీ ఏజెంట్లు బెదిరిస్తే ఇలా చేయండి
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగపూట తీపికబురు.. కాసేపట్లో ప్రకటన..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి