సినీనటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఆత్మహత్య చేసుకుంది. కీర్తి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనారోగ్యంతోనే కీర్తి చనిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.