Virat Kohli Naatu Naatu Dance: నాటు నాటు సాంగ్ క్రేజ్ నానాటికి పెరిగిపోతోంది. పాట విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ దశలోనూ నాటు నాటు పాటకు ఆకర్షణ కానీ ఆధరణ కానీ ఏ మాత్రం తగ్గలేదు. అయితే, ఎప్పుడైతే విదేశీ సినీ ప్రముఖులు, హాలీవుడ్ స్టార్స్ నాటునాటు పాటకు స్టెప్పులేయడం మొదలుపెట్టారో.. అప్పటి నుంచి నాటు నాటు పాట ఆల్వేస్ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. ఎప్పుడైతే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుందో అప్పటి నుంచి ఈ పాటకు ఉన్న క్రేజ్ పీక్స్‌లోకి వెళ్లిపోయింది. అంతటితో అయిపోలేదండోయ్.. ఈ క్రేజ్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తూ ఇటీవల ఆస్కార్ అవార్డ్ సైతం వరించడం ఇక ఆల్ టైమ్ హైలో నిలబెట్టింది.
తాజాగా విరాట్ కోహ్లీ కూడా నాటు నాటు పాటపై నాటుగా స్టెప్పులేసి దుమ్ములేపడం వైరల్ గా మారింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఈ అరుదైన దృశ్యానికి వేదికగా నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇద్దరూ కలిసి పఠాన్ మూవీ టైటిల్ ట్రాక్‌పై స్టెప్పేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ కాగా.. తాజాగా నాటు నాటు పాటపై కోహ్లీ చేసిన డ్యాన్స్ కూడా మళ్లీ అంతే వైరల్ అవుతోంది. స్టేడియంలో నాటు నాటు పాట ప్లే చేయకుండానే తన మైండ్‌లో ఆ సాంగ్‌కి గుర్తుకు వచ్చినట్టుంది కాబోలు.. అంతే హుషారుగా ఊగిపోయాడు.
.@imVkohli 🕺🕺 #NaatuNaatu 🤩 pic.twitter.com/6jjZhH7fh2
— RRR Movie (@RRRMovie) March 17, 2023
విరాట్ కోహ్లీ నాటు నాటు డాన్స్‌ని ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ షేర్ చేయడంతో ఇది మరింత వైరల్‌గా మారింది. అయితే కాపీ రైట్స్ ఇష్యూ కారణంగా ఆ వీడియో అసలు యజమానుల రిక్వెస్ట్ మేరకు ట్విటర్ ఆ వీడియోను తొలగించినట్టు తెలుస్తోంది. ఏదేమైతేనేం.. ఇదే వీడియోను ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనూ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇదిలావుంటే, ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తరపున క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ బ్యాట్‌తో మెప్పించలేకపోయాడు. 9 బంతుల్లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ బాటపట్టాడు. బ్యాట్ పరంగా ఆశించినంత పర్ఫామ్ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. ఈ నాటు నాటు వీడియోతో మొత్తానికి అభిమానులను మస్తుగా ఎంటర్టైన్ చేశాడు.
ఇది కూడా చదవండి : IND Vs Aus 1st ODI: ఆసీస్‌తో తొలి వన్డే నేడే.. అందరి కళ్లు ఆ ప్లేయర్‌పైనే..!
ఇది కూడా చదవండి : MS Dhoni IPL Career: ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సురేష్ రైనా సమాధానం ఇదే!
ఇది కూడా చదవండి : Virat Kohli Centuries: విరాట్ కోహ్లీ 100 కాదు.. 110 సెంచరీలు చేస్తాడు! షోయబ్ అక్తర్ జోస్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK