Buy Best automatic AC Cars under 10 Lakhs: వేసవి కాలం వచ్చేసింది. మార్చి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో మనకు ఇంట్లోనే కాదు.. కారులో కూడా శక్తివంతమైన ఏసీ అవసరం ఉంటుంది. ఆటోమేటిక్ ఏసీ ఫీచర్ కార్లలో మీరు ఉష్ణోగ్రతను సెట్ చేయవచ్చు. బటన్‌ను నొక్కిన వెంటనే ఉష్ణోగ్రత మీరు సెట్ చేసిన స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు సిమ్లాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మీరు రూ. 10 లక్షల లోపు ఆటోమేటిక్ ఏసీ కార్ల కోసం చూస్తున్నట్లయితే.. కొన్ని ఉత్తమ ఎంపికలు ఉన్నాయి.
Maruti Baleno Sigma:
మారుతి బాలెనో సిగ్మా ధర రూ. 6.56 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు 6 రంగులలో లభిస్తుంది. 22.35 మైలేజీని ఇస్తుంది. ఇది 1197 cc ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. బాలెనో సిగ్మాలో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ ORVMలు, టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, ఫాగ్ లైట్లు, వెనుక మరియు ముందు పవర్ విండోలు ఉన్నాయి.
Nissan Magnite:
నిస్సాన్ మాగ్నైట్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వచ్చిన ఫీచర్-రిచ్ కారు. ఇతర ఫీచర్లలో 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్‌లు, LED DRLలతో కూడిన LED హెడ్‌లైట్లు మరియు వెనుక వెంట్‌లతో కూడిన ఆటో ఎయిర్ కండిషనింగ్ ఉన్నాయి. ఈ కారు ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10.94 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది.
Tata Tiago XZ Plus:
టాటా టియాగో ఎక్స్‌జెడ్ ప్లస్ ధర రూ. 7.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). టియాగో ఎక్స్‌జెడ్ ప్లస్ 19.01 మైలేజీని అందిస్తుంది. ఈ కారు మూడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇది 1199 cc ఇంజన్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ ORVMలు, టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, ఫాగ్ లైట్లు - ఫ్రంట్, పవర్ విండోస్ రియర్, పవర్ విండోస్ ఫ్రంట్ మరియు వీల్ కవర్లు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
Hyundai Grand i10 Nios Sportz:
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్జ్ ధర రూ. 7.20 లక్షలు. ఈ కారు 6 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన 1197 సిసి ఇంజన్‌తో పవర్ చేయబడింది. 5-సీటర్ పెట్రోల్ కారులో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ ORVMలు, టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పవర్ విండోస్ రియర్, పవర్ విండోస్ ఫ్రంట్, వీల్ కవర్లు మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Also Read: డుబ్లికేట్ ఐఫోన్ మోడల్‌ను గుర్తించడం చాలా ఈజీ.. ఒక నిమిషంలో నిజమైనదో, నకిలీదో తెలుసుకోవచ్చు!
Also Read: Shubman Gill Century: శుభ్‌మన్ గిల్ అలవోకగా 8-10 వేల పరుగులు చేస్తాడు.. సునీల్ గవాస్కర్ జోస్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.