Post office Schemes: అత్యధికంగా 8 శాతం వడ్డీ ఇచ్చే పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్ ఇదే

Post offi‌ce Schemes: బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసు పథకాలతో చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ అనంతరం రక్షణగా నిలిచే పథకాలు చాలా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైంది సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2023, 10:57 PM IST
Post office Schemes: అత్యధికంగా 8 శాతం వడ్డీ ఇచ్చే పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్ ఇదే

ఇటీవలి కాలంలో పోస్టాఫీసు సేవింగ్ పథకాలకు ఆదరణ పెరుగుతోంది. విభిన్న రకాల పథకాలు అందుబాటులో ఉండటం, బ్యాంకులతో పోలిస్తే రిటర్న్స్ ఎక్కువగా ఉండటం ప్రధాన కారణం. ఇందులో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇవి పూర్తిగా సురక్షితం. సీనియర్ సిటిజన్లకు ముఖ్యంగా పోస్టాఫీసులో చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువ.

పోస్టాఫీసులు సీనియర్ సిటిజన్ల కోసం రిటైర్మెంట్ అనంతరం ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టాయి. ఇందులో ముఖ్యమైంది సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. ఈ పధకం కాల పరిమితి 5 ఏళ్లకు ఉంటుంది. ఈ పధకంపై ఏటా 8 శాతం  వడ్డీ లభిస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి 1000 రూపాయలతో ప్రారంభించి గరిష్టంగా 15 లక్షల వరకూ పెట్టవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ప్రత్యేకించి 60 ఏళ్లు దాటినవారికి వర్తిస్తుంది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. 

ఇటీవల చేసిన సమీక్షలో అంటే 2022-23 ఆర్ధిక సంవత్సరం జనవరి-మార్చ్ త్రైమాసికంలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ వడ్డీను 8 శాతం చేసింది. మార్చ్ 31 2023 వరకూ ఈ పథకంలో గరిష్ట పరిమితి 15 లక్షలుంది. ఈ పథకం కాల పరిమితి ఐదేళ్లకుంటుంది. 3 ఏళ్లు పెంచుకోవచ్చు.

ట్యాక్స్ ప్రయోజనాలు

వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తారు. మెచ్యూరిటీ సమయంలో మూలధనంతో కలిపి ఇస్తారు. వడ్డీ చెల్లింపు ప్రతి మూడు నెలలకు అంటే మార్చ్ 31 వతేదీ, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 తేదీల్లో జమ అవుతుంది. అంతేకాకుండా..సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. 

Also read: CIBIL Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి, సిబిల్ స్కోర్ మెరుగుపర్చుకునేందుకు ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News