Surya Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుని గ్రహాల రాజుగా పిలుస్తారు. సూర్యభగవానుడు ఒక రాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. ఈనెల 15న సూర్యభగవానుడు కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు వల్ల మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మీన సంక్రాంతి ఈ రాశులకు శుభప్రదం
కర్కాటకం
మీన సంక్రాంతి శుభ ప్రభావం కర్కాటక రాశి వారిపై ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కోరిక నెరవేరుతుంది. పని లేదా వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
మిథునం
సూర్య సంచారం మిథునరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పోటీపరీక్షలు రాసే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. అంతేకాకుండా జీతం కూడా భారీగా పెరుగుతుంది.
వృషభం
వృషభ రాశి వారికి సూర్య సంచారాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. దీంతో వీరి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్లో పెట్టిన ఇన్వస్ట్ మెంట్ మంచి లాభాలను ఇస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Also Read: Gudi Padwa 2023 Date: గుడి పడ్వా ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook