Richi gadi Pelli Movie Review : 'రిచి గాడి పెళ్లి' ఎలా ఉంది?.. కథ, కథనాలు ఏంటంటే?

Richi gadi Pelli Movie Review రిచి గాడి పెళ్లి అంటూ ఇప్పటికే టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు.అయితే ఈ ట్రైలర్ చూస్తే మళయాలంలో వచ్చిన 12th man అనే సినిమాకు పోలికలు కనిపిస్తాయి. కానీ దానికీ దీనికి ఏ మాత్రం సంబంధం ఉండదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 05:29 PM IST
  • థియేటర్లోకి రిచి గాడి పెళ్లి
  • పెళ్లి అంటూ పెట్టే బ్యాచ్‌లర్ పార్టీ
  • చివరకు పెళ్లి జరిగిందా?
Richi gadi Pelli Movie Review : 'రిచి గాడి పెళ్లి' ఎలా ఉంది?.. కథ, కథనాలు ఏంటంటే?

Richi gadi Pelli Movie Review ​ యూత్‌ ఆడియెన్స్‌ టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తే ఎప్పుడూ సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా చాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు రిచి గాడి పెళ్లి అంటూ బ్యాచ్‌లర్ పార్టీ నేపథ్యంతో లైన్‌ను తీసుకున్నారు. ఇక ఫ్రెండ్స్ అంతా ఒకే చోటకు చేరితో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. రిచి గాడి పెళ్లి సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
రిచి గాడి పెళ్లి కథ అంతా కూడా ఊటిలో సాగుతుంది. రిచి (సత్య ఎస్ కె) తన పెళ్లి పార్టీ అంటూ తన ఫ్రెండ్స్ అందరినీ ఊటికి పిలుస్తాడు. చిన్న నాటి ఫ్రెండ్స్‌ అందరి జీవితాల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సీరియల్ హీరోగా నటించే నవీన్‌ మీటూ సమస్యల్లో చిక్కుకోవడం ఇలా అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్ అంతా ఒకే చోటకు చేరడం, వారి వారి పర్సనల్ సీక్రెట్లన్నీ బయటకు రావడం జరుగుతుంటుంది. రిచికి ఫ్లాష్ బ్యాక్‌లోనూ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల రిషికి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఫ్రెండ్స్ అంతా కలిసి చేసిన పనులేంటి? చివరకు రిషి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది చూడాలి.

నటీనటులు
రిచి గాడి పెళ్లి సినిమాలో అందరికీ సమానమైన పాత్రలు లభించాయి. రిచిగా సత్య మంచి కారెక్టర్‌ను పోషించాడు. క్లైమాక్స్‌లో సత్య మెప్పిస్తాడు. ఇక నవీన్ అయితే సీరియల్ హీరోగా, మీటూ ఆరోపణలు ఎదుర్కొంటోన్న నటుడిగా కనిపించి మెప్పించాడు. ప్రణీత పట్నాయక్ అయితే మొండి పట్టుదల మగవారంటే ద్వేషం కనబర్చే పాత్రలో మెప్పించింది. లక్ష్మీపతి (సతీష్) పాత్ర, కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి ఇలా అందరూ చక్కగా నటించారు.

కథనం
రిచి గాడి పెళ్లి కథలో ఎన్నో లేయర్స్‌ను దర్శకుడు పొందు పరిచాడు. సోషల్ మెసెజ్‌లు కూడా చాలానే ఇచ్చాడు. కంటికి కనిపించింది నిజం కాదని, ఏ విషయంలోనైనా సరే రెండు వైపులా చూడాలని చెప్పకనే చెప్పేశారు. మీటూ ఆరోపణలపై చురకలు అంటించారు. భర్తను ప్రేమించని భార్య, భార్యను అర్థం చేసుకోని భార్య, ప్రేమ విలువ తెలుసుకోలేని ప్రియురాలు మళ్లీ తిరిగి రావడం ఇలా ప్రతీ ఒక్క ట్రాక్‌తో ఏదో ఒక మెసెజ్ ఇప్పించాలని చూశారు.

అయితే ఈ కథ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ప్రథమార్థం అంతా కూడా కాస్త స్లోగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలోనే కాస్త పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ మాత్రం అలా ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ సినిమాలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. 

ఇక సినిమాలోని కొన్ని పాటలు, చాలా సందర్భాల్లో వచ్చే మాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇక సినిమా అంతా ఒకే సెట్‌లో, ఒకే మూడ్‌లో జరుగుతుంటుంది. విజువల్స్ మెప్పిస్తాయి. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. సినిమా నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం.

రేటింగ్ 2.75

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News