Shukra And Rahu Yuti: గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. హోలి తర్వాత అంటే మార్చి 12న మేషరాశిలో శుక్రుడు మరియు రాహువు కలయిక ఏర్పడబోతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. శుక్రుడు మరియు రాహు సంయోగ సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులవారు జాగ్రత్త
కన్య రాశిచక్రం
రాహు మరియు శుక్రుల కలయిక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతుంది. దీని కారణంగా మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ పార్టనర్ తో దురుసుగా ప్రవర్తించండి, మీ సంసారంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
మేష రాశిచక్రం
రాహువు, శుక్రుడు సంయోగం వల్ల మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఆరోహణ ఇంట్లోనే ఈ కూటమి ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. లవ్ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ.
మీన రాశిచక్రం
రాహువు మరియు శుక్రుడు కలయిక మీకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మీకు డబ్బు రాక ఆగిపోతుంది. ఫ్యామిలీ సపోర్టు ఉండదు. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. జాబ్ చేసేవారు ఆఫీసులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Also Read: Rajyog: రేర్ రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం... ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.