Man Urinates On Woman Passenger in Karnataka: కర్ణాటకలో అసభ్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళపై బెంగుళూరుకు చెందిన వ్యక్తి మూత్రం ఘటన మరువకముందే.. అదే తరహా ఘటన చోటు చేసుకుంది. బస్సులో నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై ఓ యువకుడు మూత్రం పోసిన విషయం కలకలం రేపుతోంది. విజయపూర నుంచి మంగుళూరుకు నాన్ ఏసీ స్లీపర్ బస్సు.. హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో టీ తాగేందుకు ఓ డాబా వద్ద ఆగింది.
బస్సులోని కొందరు ప్రయాణికులు దిగి టీ తాగుతుండగా.. కొందరు వాష్‌రూమ్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో సీటు నెంబర్ 28లో కూర్చున్న రామప్ప (25) అనే యువకుడు.. ముందుసీట్లో కూర్చొని నిద్రపోతున్న మహిళ వద్దకు వచ్చాడు. ఆమెపై మూత్ర విసర్జన చేయగా.. నిద్ర మత్తులో ఉన్న మహిళ ఈ హఠాత్తు పరిణామంతో ఉలిక్కిపడింది. వెంటనే భయంతో కేకలు వేయగా.. మిగిలిన ప్రయాణికులు అందరూ వచ్చి యువకుడిని పట్టుకున్నారు. అతనికి లాగేజీని బస్సులోని నుంచి కిందకు విసిరేసి దేహశుద్ధి చేశారు. మహిళ స్నానం చేసిన తరువాత బస్సును కదిలింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ నిరాకరించడంతో ఆ యువకుడిపై పోలీసులకు చెప్పలేదని కండక్టర్ తెలిపారు.
గతేడాది ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తుండగా.. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆమె దుస్తులు, బూట్లు, హ్యాండ్ బ్యాగ్ మొత్తం మూత్రంతో తడిసిపోగా.. ఎయిర్ ఇండియా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో బాధిత మహిళ సంస్థ ఛైర్మన్ చంద్రశేఖర్‌కు లేఖ రాయడంతో మూత్ర విజర్జన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి