టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తలుపులు మూసి అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందిగాకా..కనీసం హామీలు నెరేవర్చెందుకు ఎందుకు ముందుకు రావడం లేదని అని గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు . అడ్డగోలుగా జరిగిన విభజన ప్రక్రియతో ఏపీ ప్రజలు రాజధాని కోల్పోవడంతో పాటు చాలా విషయాల్లో తీవ్రంగా నష్టపోయారు. కనీసం విభజన హామీలైనా కేంద్రం నెరవేరుస్తుదని ఆశగా చూశాం.. అదీ చేయడం లేదు.
ఇప్పటి వరకు పరిపాలించుకోవడానికి మాకు రాజధాని నిర్మాణం జరగలేదు..పోలవరం ప్రాజెక్టు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమల ఏర్పాటు జరగలేదు.. పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.. ఈ విషయంలో కూడా కేంద్రం మోండి చేయి చూపించింది.. నాలుగేళ్ల పాటు నిరీక్షించాం.. ఆశ చచ్చిపోయింది. ఇక మౌనంగా ఉంటే భవిష్యత్తులో మరింత నష్టపోతామని భావించే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని జయదేవ్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన పార్టీలకు ధన్యవాదాలు తెలిసి తన ప్రసంగాన్ని ముగించారు.
ఎంపీ గల్లా జయదేవ్ సంధించిన అస్త్రాలు ఇవే..
* పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం జరగలేదు
* పోలవరం నిర్మాణం విషయంలో జాప్యం
* పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదు
* జాతీయ ప్రాజెక్టులన్నీ నత్తనడకగా సాగుతున్నాయి
* ప్రత్యేక హోదా విషయంలోనూ మోండి చేయి
* ఎన్నికల హామీలనూ మోడీ సర్కార్ నెరవేర్చలేదు
* ఎయిమ్స్ తో పాటు విద్యా సంస్థల ఏర్పాటు ఊసే లేదు
* ఏపీ సమస్యలకు కాంగ్రెస్, బీజేపీ సమాన బాధ్యులు
* ఆంధ్రప్రదేశ్ పుంజుకోలంటే ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా చూడాలి
* శివాజీ, పటేల్ విగ్రహాలకు వేల కోట్లు ఇచ్చి.. ఏపీ రాజధానికి వెయ్యి కోట్లు !
* ప్రత్యేకు వద్దని టీడీపీ ఎప్పుడూ చెప్పలేదు
* తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను మోడీ విస్మరించారు
* రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు తెలంగాణకు, ఏపీకి అప్పులు
* అప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రాన్ని విభజించారు
* పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన హోదా హామీని విస్మరించారు
* విభజన చట్టంపై మోదీకి గౌరవం లేదు