Taraka Ratna Biography: నందమూరి తారకరత్నఅనేది తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి వంశం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. 2002వ సంవత్సరంలో ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో తారకరత్న హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ సినిమాతో అందుకున్న క్రేజ్ తో ఒకేరోజు 9 విభిన్నమైన సినిమాలను ప్రారంభించి సినీ చరిత్రలోనే మరెవరు బద్దలు కొట్టలేని రికార్డును తన పేరిట సృష్టించుకున్నాడు. అయితే అందులో విడుదలైన సినిమాలు కొన్నే. సినిమాలు ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తారకరత్న కెరీర్ గ్రాఫ్ ఒక్క సారిగా పడిపోయింది తర్వాత విలన్ గా కూడా నటించడం మొదలుపెట్టిన ఆయన అమరావతి అనే సినిమాలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు సైతం అందుకున్నాడు. ఇక నందమూరి తారకరత్న పర్సనల్ విషయాలు ఆయన కెరీర్ కు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తారకరత్న పర్సనల్ లైఫ్:
1983 ఫిబ్రవరి 22వ తేదీన తారకరత్న నిమ్మకూరులో జన్మించాడు. ఆయన తండ్రి పేరు మోహనకృష్ణ తల్లి పేరు శాంతి. నందీశ్వరుడు అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అలేఖ్య రెడ్డి అనే యువతిని తారకరత్న ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తారకరత్నకు ఇది మొదటి వివాహం కాగా అలేఖ్య రెడ్డికి మాత్రం రెండో వివాహం. వీరిద్దరికీ నిష్క అనే ఒక కుమార్తె కూడా ఉంది. తాత నందమూరి తారక రామారావు బాబాయ్ నందమూరి బాలకృష్ణ, పెదనాన్న హరికృష్ణ వంటి వారి నట వారసత్వం అందుకుని ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఆయన హీరోగా లాంచ్ అయ్యారు.
తారకరత్న సినీ కెరీర్
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా లాంచ్ అయిన తారకరత్న తర్వాత యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహా భక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంతా, రాజా చేయి వేస్తే, ఖయ్యూం భాయ్, దేవినేని, సారధి, ఎస్ఫై నోఎగ్జిట్ వంటి సినిమాల్లో నటించారు. ఇక ఓటీటీలో నైన్ అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అమరావతి సినిమాలో తారకరత్న నటించిన విలన్ పాత్రకు గాను నంది అవార్డు అందుకున్నారు. ఒకపక్క సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.
తారకరత్న పొలిటికల్ కెరీర్
తారకరత్న కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన భార్య అలేఖ్య రెడ్డి చిన్నాన్న విజయసాయిరెడ్డి ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.అయితే తారకరత్న తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నారు. ఆయన గుంటూరు లేదా కృష్ణాజిల్లాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ప్రారంభమైన క్రమంలో ఆ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురి కావడంతో సుమారు 23 రోజుల నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నాడు.
Also Read: Balakrishna vs Pawan: మొన్న అన్నతో ఈ సారి తమ్ముడితో.. బాలయ్య ఎక్కడా తగ్గట్లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook