Akhil Sarthak : ఆ ఏజ్‌లో పెళ్లి.. ఆమెనే చేసుకుంటా.. అఖిల్ కామెంట్స్

Akhil Sarthak About His Marraiage బిగ్ బాస్ షోతో అఖిల్ సార్థక్ ఓ రేంజ్‌లో ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు సీరియల్స్ ద్వారా చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చాడు. కానీ బిగ్ బాస్ తరువాత ఆయన కెరీర్ మారిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 08:10 AM IST
  • బీబీ జోడితో ట్రెండింగ్‌లో అఖిల్
  • తేజస్వీతో రొమాంటిక్‌గా అఖిల్ సార్థక్
  • పెళ్లి, డేటింగ్‌ల మీద అఖిల్ కామెంట్స్
Akhil Sarthak : ఆ ఏజ్‌లో పెళ్లి.. ఆమెనే చేసుకుంటా.. అఖిల్ కామెంట్స్

Akhil Sarthak About His Marraiage అఖిల్ సార్థక్ తాజాగా తన పెళ్లి గురించి నోరు విప్పాడు. ఇన్ స్టాగ్రాంలో అఖిల్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఏ వయసులో పెళ్లి చేసుకుంటే బెటర్.. సరైన సమయం అని మీరు అనుకుంటున్నారు? అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో అఖిల్ తన పెళ్లి గురించి అసలు విషయాన్ని చెప్పేశాడు.

పెళ్లికి సరైన సమయం 32 లేదా 33 అని అనుకుంటున్నాను.. నాకు ఇప్పుడు 27 ఏళ్లు.. ఇంకో ఐదేళ్ల వరకు నాకు అయితే పెళ్లి ఆలోచన లేదు.. ఇప్పుడు నేను ప్రేమలో లేను.. డేటింగ్ చేయడం లేదు.. రిలేషన్ షిప్‌లోనూ లేను.. ఒక వేళ నేను ఎవరితోనైనా రిలేషన్‌లో ఉంటే.. డేటింగ్ చేస్తే.. ప్రేమిస్తే.. వాళ్లనే పెళ్లి చేసుకుంటాను.. నేను టైం పాస్‌కు మాత్రం డేటింగ్ చేయను.. అంటూ ఇలా తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు.

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ ఇంట్లో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. నాలుగో సీజన్‌లో అఖిల్, అభిజిత్, మోనాల్ ట్రయాంగిల్ స్టోరీ ఎంతటి రచ్చగా మారిందో తెలిసిందే. అఖిల్ మోనాల్ లవ్ ట్రాక్ మీద అయితే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అఖిల్ మోనాల్‌ నానా హంగామా చేశారు.  ఈ ఇద్దరూ కలిసి తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి అనే వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు.

బిగ్ బాస్ ఇంట్లోకి రెండు సార్లు వెళ్లే అవకాశం అఖిల్‌కు వచ్చింది. నాలుగో సీజన్లో రన్నర్‌గా నిలిచాడు అఖిల్. కరోనా టైంలో బిగ్ బాస్ ఓటీటీ వచ్చింది. అక్కడా రన్నర్‌గా నిలిచాడు అఖిల్. తన పద్దతిని సరిగ్గా మార్చుకోలేకపోయాడు. విన్నర్‌గా నిలవలేకపోయాడు. అలా బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచే చాన్స్ మాత్రం అఖిల్‌కి రాలేదు.

బుల్లితెరపై ఇప్పుడు అఖిల్ దుమ్ములేపుతున్నాడు. అనవసరంగా ఆ ఢీ షో చేశాడు. అక్కడ ఆది వేసే పంచులను భరించాడు. ఇప్పుడు బీబీ జోడిలో తేజస్వీతో కలిసి రచ్చరచ్చ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న పర్ఫామెన్స్‌లు సోషల్ మీడియాలో మంటలు పుట్టించేస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఈ జోడి ట్రెండింగ్‌లో ఉన్న సమయంలోనే ఇలా డేటింగ్, ప్రేమ, పెళ్లి అంటూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతున్నాయి.

Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x