Road Accident in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా భానుప్రతాప్‌పూర్‌లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థులు, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ ముగిసిన తరువాత ఆటోలో విద్యార్థులు ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో మరణించారు. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు, ఆటో డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
భానుప్రతాపూర్ కంకేర్‌లోని కోరేర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోగా.. చిన్నారుల బంధువులు రోదనలు మిన్నంటాయి. గాయపడిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన పిల్లలిద్దరినీ మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ఆటో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఆటో ముక్కముక్కలు అయింది.
Chhattisgarh | Seven students dead while a student and an auto driver injured after an auto carrying school students was hit by a truck near Korar village in Kanker district. Injured students rushed to hospital in Korar, confirms IG Bastar P Sundarraj pic.twitter.com/AI19yPmJ7T
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 9, 2023
ఈ ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు. కంకేర్ జిల్లాలోని కోరేర్ చిల్హతి చౌక్ వద్ద ఆటో, లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు ఆకస్మికంగా మరణించిన వార్త చాలా బాధించిందని అన్నారు. ప్రభుత్వం తరుఫున అన్ని సహాయాలు అందిస్తామన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.
Also Read: Ind Vs Aus 1st Test: జడ్డూ భాయ్ రీఎంట్రీ అదుర్స్.. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్
Also Read: Sahith Mangu: అమెరికాలో తెలుగు కుర్రాడి సత్తా.. టాప్ స్పీకర్ అవార్డుకు ఎంపిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook