Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే

Kiara Advani Wedding Pics కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్ కోటలో ఈ వివాహాం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ఫోటోలను కియారా, సిద్దార్థ్‌లు స్వయంగా షేర్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 02:35 PM IST
  • కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి
  • తన హీరోయిన్ పెళ్లి మీద రామ్ చరణ్
  • పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయట!
Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే

Ram Charan Post on Kiara Advani Wedding pics కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి నిన్న (ఫిబ్రవరి 7) ఘనంగా జరిగింది. కియారా పెళ్లి వార్తలు గత వారం నుంచి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ పెళ్లి విషయాన్ని ముందుగా ప్రకటించలేదు. అభిమానులకు ఆహ్వానం ఇవ్వలేదు. బంధు మిత్రులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. రామ్ చరణ్‌ తన హీరోయిన్ పెళ్లి మీద స్పందించాడు. రామ్ చరణ్ సతీ సమేతంగా కియారా పెళ్లికి వెళ్లినట్టు తెలుస్తోంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. అంటూ కియారా, సిద్దార్థ్‌లకు కంగ్రాట్స్ చెప్పాడు రామ్ చరణ్‌. 

 

షేర్షా మూవీ నుంచి కియారా, సిద్దార్థ్ మధ్య ప్రేమ చిగురించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలోనూ ప్రేమికులుగా నటిస్తారు. రీల్ కోసం కాకుండా రియల్‌గానే ప్రేమలో పడ్డట్టున్నారు. అందుకే స్క్రీన్ మీద అంతగా కెమిస్ట్రీని పండించారు. కియారా, సిద్దార్థ్‌లు ఎప్పుడూ కూడా తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించలేదు. తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించలేదు.

పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని కన్ఫామ్ చేశారు. పెళ్లి వార్తలు వస్తున్నా.. ముహూర్తం ఇది అని చెబుతూ వార్తలు వచ్చినా కూడా ఈ ఇద్దరూ మాత్రం ఎప్పుడూ నోరు విప్పలేదు. ఏకంగా నిన్న తాళి కట్టిన తరువాత, ఒక్కటైన తరువాత పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మేం బుక్ అయిపోయాం అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

కియారా పెళ్లి ఫోటోల మీద ఉపాసన స్పందించింది. మామూలుగా అయితే రామ్ చరణ్‌, ఉపాసనలు పెళ్లికి వెళ్తారనే వార్తలు వచ్చాయి. కానీ పెళ్లికి వెళ్లడం కుదర్లేదట. దీంతో కియారాకు సారీ చెప్పింది ఉపాసన. పెళ్లికి రాలేకపోయాం క్షమించు.. కంగ్రాట్స్ అంటూ ఉపాసన వేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

మహేష్‌ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కియారా. ఆ తరువాత బోయపాటి రామ్ చరణ్‌ కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్‌ శంకర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో సౌత్, నార్త్‌లో తన సత్తా చాటేందుకు కియారా రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది.

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News