Chile wildfire: చిలీలో కార్చిచ్చులు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ కార్చిచ్చులు ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 554 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ అంతర్గత మంత్రి కరోలినా తోహా తెలిపారు. పది మంది తప్పిపోయినట్లు తెలుస్తోంది. కాబ్టటి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆ దేశవ్యాప్తంగా 251 ప్రాంతాల్లో మంటలు వ్యాపించగా..151 ప్రాంతాల్లో కార్చిచ్చులు అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 16 మరణాలు బయోబియోలో, ఐదు లా అరౌకానియాలో మరియు ఒకటి నుబుల్‌లో జరిగాయి. లా అరౌకానియాలో మంటలను అదుపు చేసేందుకు వచ్చిన హెలికాప్టర్ కుప్పకూలడంతో బొలీవియన్ పైలట్ మరణించారు. ఈ ప్రమాదంలో చిలీకి చెందిన ఓ మెకానిక్ కూడా చనిపోయాడు.
ఈ మంటల వల్ల సుమారు 40వేల హెక్టార్లు (99,000 ఎకరాలు) దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇది యూఎస్ నగరమైన ఫిలడెల్ఫియా కంటే పెద్ద ప్రాంతం. చిలీ దేశంలో ఈకార్చిచ్చులకు వందలాది ఇళ్లు బూడిదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి వడగాలుల కారణంగానే ఈ మంటలు ఎక్కువ అవుతున్నాయని అధికారులు తెలిపారు. అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం బయోబియో మరియు Ñన్యూబుల్ అనే రెండు ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది మరియు పొరుగు దేశాల నుండి సహాయం కోసం అడుగుతోంది.
Also Read: Pakistan: పాకిస్థాన్‌లో వికీపీడియాపై బ్యాన్.. కారణం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook