Delhi Crime: ఎలా వస్తాయి రా బాబు ఐడియాలు.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆకట్టుకునేందుకు మైనర్లు ఏం చేశారంటే..

Delhi Bar Codes Crime: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయడానికి యువకులు ఎన్నో అబద్దాలు చెబుతుంటారు. అప్పులు చేసి వారికి ఖర్చు పెడుతుంటారు. కానీ ఆ ఇద్దరు మైనర్లు మాత్రం డిఫరెంట్. కొత్త ప్లాన్ వేశారు. పక్కగా అమలు చేశారు. కానీ చివరి బెడిసికొట్టింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 01:26 PM IST
Delhi Crime: ఎలా వస్తాయి రా బాబు ఐడియాలు.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆకట్టుకునేందుకు మైనర్లు ఏం చేశారంటే..

Delhi Bar Codes Crime: వారిద్దరు మైనర్లు. విలావంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఇద్దరికి గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. వారిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని కొత్త ప్లాన్ వేశారు. ఇందుకోసం చిన్న వ్యాపారులను ఎంచుకున్నారు. వారిని మోసం చేసినా.. పెద్దగా పట్టించుకోరనే ధీమాతో టోకరా వేశారు. చివరికి బాధితుల ఫిర్యాదుతో జైలు పాలయ్యారు. బార్‌కోడ్‌ల కోసం దరఖాస్తు చేస్తామనే సాకుతో రిక్షా పుల్లర్‌లను, కూరగాయల విక్రయదారులను మోసగించినందుకు ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీలో ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న ఇద్దరు మైనర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరూ బాధితులకు సంబంధించిన ఈ-వాలెట్ పోస్ట్‌పెయిడ్ ఖాతాను రహస్యంగా యాక్టివేట్ చేసి.. వారి చెల్లింపు ఖాతాల నుంచి డబ్బును డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు. పాత స్నేహితుల గుర్తింపుతో ఉద్యోగం సంపాదించిన నిందితులు.. ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నట్లు చెప్పారు.

ఈ-రిక్షా డ్రైవర్ ఆశిష్ కుమార్ చేసిన ఫిర్యాదుతో మైనర్ల బాగోతం వెలుగులోకి వచ్చిందని నార్త్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ సింగ్ తెలిపారు. ఇద్దరు అబ్బాయిలు కలిసి వీధుల్లో వ్యాపారం చేసుకునే వారిని మోసగించారని చెప్పారు. యూపీఐ బార్ కోడ్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో సులువుగా చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పి రూ.60 వేలు మోసం చేశారని చెప్పారు. 

పోలీసులకు ఇదే తరహాలో మరొక ఫిర్యాదును స్వీకరించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ఇద్దరు యువకులను నాంగ్లోయ్ ప్రాంతంలో పట్టుకున్నారు. ఇద్దరిని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వారిలో ఒకరు బార్‌కోడ్‌లను యాడ్ చేసే టైమ్ జాబ్ గురించి తెలుసుకున్నారని.. 18 ఏళ్లు పైబడిన స్నేహితుడి ఐడీని ఉపయోగించి పని చేయడం ప్రారంభించారని తేలింది. 

మరో యువకుడు కూడా అతనితో వెళ్లి ప్రారంభించాడు. వీరిద్దరూ వేర్వేరు ప్రదేశాలకు వెళ్లి కూరగాయలు వ్యాపారులు, ఆటో రిక్షా డ్రైవర్లు మొదలైన వారికి బార్ కోడ్‌లు పెట్టేవారు. బార్ కోడ్‌ని సెటప్ చేయడానికి కస్టమర్ల ఈ-వాలెట్ ఖాతాను ఉపయోగించడం అవసరం. ఇద్దరూ ఈ ఖాతాదారులను మోసం చేశారు. ఈ వ్యక్తులు రూ.60 వేలు, 8 వేలు, 8 వేలు ఫిర్యాదుదారులతో సహా ముగ్గురిని మోసం చేశారని  పోలీసులు తెలిపారు. ఇద్దరూ విలాసవంతమైన జీవనశైలిని గడపడానికి, తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆకట్టుకోవడానికి ఈ డబ్బు ఖర్చు చేసేవారని వెల్లడించారు. 

Also Read:  Ration Shops: రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి వచ్చేసింది  

Also Read: Amul Milk Price Hike: అమూల్ పాల ధర రూ.3 పెంపు.. కొత్త ధరలు ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News