Vande Metro Train: త్వరలో 'వందే మెట్రో' రైళ్లు.. ఈ ఏడాది చివరికి హైడ్రోజన్‌ రైలు..

Vande Metro Train: వందేభారత్‌ రైలు తరహాలో 'వందే మెట్రో' రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇవీ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తీసుకురాబోతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2023, 10:20 AM IST
Vande Metro Train: త్వరలో 'వందే మెట్రో' రైళ్లు.. ఈ ఏడాది చివరికి హైడ్రోజన్‌ రైలు..

Vande Metro Train: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ని ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. వందే భారత్ రైలు విజయవంతమవడంతో ఇప్పుడు రైల్వేశాఖ 2024-25 నాటికి వందే మెట్రో రైలును కూడా ప్రారంభించబోతున్నట్లు ఆయన చెప్పారు. 

వందే మెట్రో రైలు ప్రత్యేకత ఏమిటి?
నగరాల్లో 50-60 కి.మీ దూరం ప్రయాణించేలా వందే మెట్రో రైలును త్వరలో తీసుకురాబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది ప్రొడక్షన్, డిజైన్ వర్క్ పూర్తి చేసి.. వచ్చే ఏడాది నుంచి దీన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. వందే మెట్రో 125 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని రైల్వే మంత్రి తెలిపారు. దీని డిజైన్ ముంబై సబ్-అర్బన్ తరహాలో ఉంటుంది. అయితే వందే మెట్రోలో టాయిలెట్ సౌకర్యం ఉండదు.

వందే మెట్రో రైలు 1950 మరియు 1960 లలో రూపొందించిన అనేక రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.  దీనిలోని ఇంజిన్ పూర్తిగా హైడ్రోజన్ ఆధారితంగా ఉంటుంది. దీని వల్ల కాలుష్య ఉదార్గాలు ఏమీ ఉండవు.  వందే భారత్ రైలు మాదిరిగానే ఈ రైలులో కూడా ఆధునిక బ్రేక్ సిస్టమ్, రెడ్ సిగ్నల్ బ్రేకింగ్ నిరోధించడానికి కవాచ్ సేఫ్టీ సిస్టమ్, ఆటోమేటిక్ డోర్, ఫైర్ సెన్సార్, జీపీఎస్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఛార్జీలు అందుబాటులో ఉండేలా దీనిని తీసుకురానున్నారు. 

దేశీయంగా హైడ్రోజన్‌ రైలు..
ఈ ఏడాది చివరికల్లా తొలి హైడ్రోజన్‌ రైలు అందుబాటులోకి వస్తుందని మంత్రి అన్నారు. దీనిని దేశీయంగా తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముందుగా దీనిని హెరిటేజ్‌ సర్క్యూట్‌లో నడుపుతామని.. తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామని ఆయన చెప్పారు. 

మరో నాలుగు నగరాలకు..
దేశంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఉత్పత్తిని మరో నాలుగు కర్మాగారాలకు విస్తరించబోతున్నట్లు రైల్వేశాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ రైళ్లు చెన్నైలోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ మాత్రమే తయారువుతున్నాయి. ఇక నుంచి హరియాణాలోని సోనీపత్‌, మహారాష్ట్రలోని లాతూర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కర్మాగారాల్లోనూ ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 

రైల్వే ఆదాయ, అంచనాలు
రైల్వే తన ఆదాయ, వ్యయాల వివరాలను కూడా బడ్జెట్‌లో పొందుపరిచింది. 2023-24 బడ్జెట్‌లో ప్రయాణీకుల నుంచి రూ.70,000 కోట్లు ఆర్జించవచ్చని అంచనా వేసింది. ఇది గతంలో కంటే ఆరు కోట్లు ఎక్కువ.  గత బడ్జెట్ లో సరుకు రవాణా ద్వారా ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఆదాయం వస్తున్నట్లు అంచనా వేస్తే.. ఈసారి దానిని రూ.1.79 లక్షల కోట్లుగా చూపించారు.

Also Read: Budget 2023: అమృత్ కాల్ అంటే ఏంటి ? బడ్జెట్ స్పీచ్‌లో ఆ పదం పదేపదే ఎందుకు ఉపయోగించారు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News