Shani Ast 2023: శని దేవుడు అందరికీ ఒకేలాగా ఫలితాలను ఇవ్వడు. ఖర్మ ఫలితాలను బట్టి శని దేవుడి చెడు ప్రభావం, మంచి ప్రభావాలను ఇస్తాడని అందరికీ తెలిసిందే. కర్మల బట్టి ఫలితాలు ఇవ్వడాన్నే మహాదశ, సాడేసతి లేదా ధైయా అని జ్యోతిష్య శాస్త్రంలో అంటారు. శని 30 సంవత్సరాల తర్వాత జనవరి 17న తన సొంత రాశి కుంభ రాశిలోకి సంచారం చేశారు. అయితే శని కుంభ రాశిలో వచ్చే నెల 5 వరకు ఉంటాడు. అయితే ఈ సంచార ప్రభావం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో చికటి రోజులు మొదలవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ శని సంచారం వల్ల ఏయే రాశులవారు ఎలాంటి దుష్ప్రభావాలకు గురవుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు:
మేషరాశి:
శని దేవుడు మేషరాశి జాతకంలో పదకొండవ స్థానంలో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ ప్రభావం వీరి జీవితంలో వృత్తి, విద్యపై పడే ఛాన్స్ ఉంది. దీంతో ఈ రాశివారికి చాలా రకాల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
వృషభ రాశి:
శని గ్రహం సంచారం వల్ల వృషభ రాశివారికి కూడా తీవ్ర సమస్యలు తప్పవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని శని చెడు ప్రభావం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయే ఛాస్స్ కూడా ఉంది. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందలేరు.
మిధునరాశి:
శని దేవుడిని మిధున రాశికి అధిపతిగా భావిస్తారు. అయితే ఈ రాశివారికి శని 9వ స్థానంలో ఉండబోతున్నాడు. దీని కారణంగా దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చెడు వార్తలు కూడా వింటారు. ఈ సంచార క్రమంలో అనారోగ్య సమస్యలు వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్ సినిమా క్యాస్టింగ్ ఇద
Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook