FM Nirmala Sitharaman announces Mahila Samman Saving scheme for women in Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్‌కు సమర్పించారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలమ్మ ప్రసంగించారు. బడ్జెట్ సందర్భంగా మహిళలకు, వృద్ధులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మహిళల కోసం కేంద్రం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది.
మహిళల కోసం ప్రత్యేకంగా 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' అనే పథకాన్ని బడ్జెట్ 2023లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కాలపరిమితి రెండేళ్లు. ఈ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. పాక్షిక మినహాయింపులకు ఇందులో అవకాశం ఉంటుంది.
ఇక సీనియర్ సిటిజన్లకు 'సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్' కింద ప్రస్తుతం గరిష్ఠ పరిమితి రూ. 15 లక్షల వరకు మాత్రమే ఉంది. దీన్ని రూ. 30 లక్షలకు వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. అలానే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పరిమితిని కూడా పెరిగింది. రూ. 4.5 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ ఉన్న వారికి ప్రస్తుతం ఉన్న రూ. 9 లక్షలను రూ. 15 లక్షలకు పెంచారు. ఈ పథకంపై 7.10% వడ్డీ లభిస్తుంది.
బడ్జెట్‌లో మొదటిసారిగా ఓ కొత్త ప్యాకేజీని కేంద్రం ప్రవేశపెట్టింది. 'పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్' పేరుతో నూతన ప్యాకేజీని తీసుకురాబోతోంది. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ తెలిపారు. ఎంఎస్‌ఎంసీ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ) వాల్యూ చెయిన్‌తో అనుసంధానం చేయడం వల్ల ఉత్పత్తుల నాణ్యత పెరగడం, క్షేత్రస్థాయిలో అవి మెరుగుపరచడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
Also Read: Budget 2023-24 Price Hike: కేంద్ర బడ్జెట్ 2023.. ధరలు తగ్గే, పెరిగే వస్తువులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.