Ind Vs Nz 1st Odi: కివీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అయ్యర్ దూరమయ్యాడని.. అతని స్థానంలో రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు వెల్డించింది. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. దేశవాళీ మ్యాచ్‌ల్లో రజత అద్భుతమైన ప్రదర్శన కనబర్చడంతో జట్టులో చోటు దక్కింది.
మూడు వన్డేల సిరీస్‌ను రేపటి నుంచి ప్రారంభంకానుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ నెల 21న రాయ్‌పూర్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ జనవరి 24న ఇండోర్‌లో జరగనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
శ్రేయస్ అయ్యర్‌కి 2022 గుర్తుండిపోయే సంవత్సరం. గతేడాది అయ్యర్ 17 వన్డేల్లో 724 పరుగులు చేశాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున 7 టెస్టులు, 42 వన్డేలు, 49 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఈ ఏడాది ఆరంభం అతనికి అనుకూలంగా లేదు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్ పెద్దగా రాణించలేదు. చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో 28, 28, 38 పరుగులు చేసి ఔటయ్యాడు.
అయ్యర్ స్థానంలో తుది జట్టులోకి మిస్టర్ 360 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది. 2022లో భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సూర్య.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. 45 టీ20 మ్యాచ్‌ల్లో 1578 పరుగులు చేశాడు, ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 17 వన్డేల్లో 388 పరుగులు చేశాడు.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
Also Read: Comedian Ali: పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం.. నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు
Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shreyas Iyer: భారత్‌కు ఎదురుదెబ్బ.. టీమ్ నుంచి శ్రేయస్ అయ్యర్ ఔట్