Rath Saptami 2023: రథసప్తమి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏంటి?

Rath Saptami 2023: హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. రథసప్తమి ఎప్పుడు, దాని శుభ సమయం తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2023, 04:36 PM IST
Rath Saptami 2023: రథసప్తమి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏంటి?

Rath Saptami 2023:  మన కంటికి కనిపించే దేవుడు సూర్యభగవానుడు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. మన సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో ఈరోజునే మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, కశ్యప మహర్షి మరియు అదితి దేవి గర్భం నుండి సూర్య దేవుడు ఈ రోజున జన్మించాడు. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం లభిస్తాయని చెబుతారు. రథసప్తమి ఎప్పుడు, దాని శుభ సమయం మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం. 

రథ సప్తమి 2023 తేదీ
రథసప్తమి పండుగ జనవరి 28న వస్తుంది. ఈ పండుగను సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి మరియు ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ రోజున సూర్యభగవానుడు తన దివ్యకాంతితో ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. రథసప్తమి నాడు గంగాస్నానం మరియు దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

రథ సప్తమి 2023 ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి జనవరి 27, 2023 ఉదయం 09.10 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు జనవరి 28, 2023 ఉదయం 08.43 గంటలకు ముగుస్తుంది. ఈరోజున సూర్యోదయ సమయంలో సూర్య భగవానుని పూజిస్తారు. 
రథసప్తమి నాడు స్నానం చేసే సమయం - ఉదంయ 05:29- మార్నింగ్ 07:14.  వ్యవధి - 01 గంట 45 నిమిషాలు.

Also Read: Surya Dev: సూర్య గోచారం వల్ల ఈరాశులకు గోల్డెన్ డేస్.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News