Sun Transit In Makar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, మన కంటికి కనిపించే దేవుడు సూర్యభగవానుడు. ఇతడు ఆత్మ, తండ్రి, గౌరవం మెుదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. సూర్యగ్రహాన్ని తూర్పు దిశకు కారకుడిగా పరిగణిస్తారు. సూర్యదేవుడు నేడు మకరరాశిలోకి (Surya Gochar 2023) ప్రవేశించనున్నాడు. మకరరాశికి అధిపతి శనిదేవుడు. పైగా అదే రాశిలో సంచరిస్తున్నాడు. శనిదేవుడి రాశిలో సూర్యభగవానుడి సంచారం ఏ రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
సూర్య గోచారం ఈ రాశులకు ప్రయోజనం
వృషభ రాశి (Taurus): సూర్యభగవానుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యదేవుడు ఈ రాశి యెుక్క నాల్గో ఇంటికి అధిపతి. పైగా సూర్యదేవుడు మీ అదృష్ట స్థానంలో సంచరిస్తాడు. అమ్మవారి అనుగ్రహంతో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు పొందుతారు. మీరు ఏదైనా అస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. కళారంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశిచక్రం (Cancer): సూర్య భగవానుని సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యదేవుడు మీ జాతకంలోని ఏడో ఇంటికి అధిపతిగా భావిస్తారు. మీరు రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఈ టైం విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది.
వృశ్చిక రాశిచక్రం (Scorpio): సూర్యభగవానుని సంచారం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే కర్మకు అధిపతి అయిన సూర్యదేవుడు మూడో ఇంట్లో ఉంటాడు. కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన ఉన్నవారి కల నెరవేరే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sun Transit 2023: సంక్రాంతి నాడే సూర్యభగవానుడి మకరరాశి ప్రవేశం... ఈ రాశులకు ఊహించనంత ధనం..