Happy Pongal 2023: పంజాబ్, హర్యానాలోని హిందువులు, సిక్కు ఉమ్మడిగా లోహ్రీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండగను ప్రతి సంవత్సరం మొదటి నెలలో జరుపుకుంటారు. అయితే మన తెలుగువారు సంక్రాంతి అంటే పంజాబీయులు వారి భాషలో సంక్రాంతిని లోహ్రీగా పిలుస్తారు. అయితే ఈ పండగ వారికి ఎంతో ప్రముఖ్యమైనది. ఆ రోజూ అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పిండి వంటాలను ఆస్వాదిస్తారు. అంతేకాకుండా లోహ్రీ పండుగ రోజున ఈ అగ్నిలో బెల్లం, రేవడి, శనగలు వేసి ప్రదక్షిణలు చేస్తూ దేవులను తలుచుకుంటారు. ఇదే క్రమంలో అగ్ని దేవుడికి కొత్తగా వచ్చిన పంటలతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడతారు.
ఈ సంవత్సరంలో పండగల్లో గందరగోళం నెలకొంది కాబట్టి వచ్చే లోహ్రీ పండగకు సంబంధించిన తేది, ఇతర వివరాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం.. 13 జనవరిన లోహ్రీని జరగనుంది. అంతేకాకుండా రెండు తేదిలో అనగా 14 రోజున కూడా జరుపుకోవచ్చు.దృక్ పంచాంగం ప్రకారం.. లోహ్రీని శనివారం జరుపుకుంటారు. అంటే మకర సంక్రాంతికి ముందు రోజు నిర్వహిస్తారు. లోహ్రీ తేదీ జనవరి 14 ఉదయం 5.27 నుంచి 6.21 వరకు జరుపుకుంటే మంచి ఫలితాలు పొందుతారని పలువురు నిపుణులు తెలుపుతున్నారు.
లోహ్రీ పండుగ పంటల్లో విత్తిన వినాలపై, పండించిన పంటపై ముడిపడి ఉంటుంది. రైతులు వారు పండించిన పంటలకు మంచి దిగుబడి వచ్చి, ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో రైతులు వారు చేసిన గుర్తింపుకు గాను ఈ పండగను జరుపుకుంటారని పూర్వీకులు పేర్కొన్నారు. అయితే ఈ లోహ్రీ ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు రాత్రి టైం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి పూట అగ్ని పూజలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పంచాగ నిపుణులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా ఈ పండగా కొత్తగా పెళ్లయిన దంపతులకు ఎన్నో రకాల ఆనందాలను తెచ్చిపెడుతుంది. దంపతులుద్దారు పుట్టినింటికి వెళ్లి పిండి వంటలను ఆస్వాదిస్తారు. అంతేకాకుండా వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి ఈ రోజూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరీకి ఎంతో ప్రముఖ్యమైన రోజుగా చెప్పుకుంటారు.
Also Read: Shirdi Bus Accident: షిరిడీ యాత్రకు వెళుతూ తిరిగిరాని లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి