Pan card: పాన్‌కార్డు ఎన్ని రకాలు, పాన్‌కార్డు పోతే తక్షణం ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి

Pan card: నిత్యావసరమైన కీలకమైన డాక్యుమెంట్లలో పాన్‌కార్డు ఒకటి. ఒకవేళ పొరపాటున పాన్‌కార్డు పోగొట్టుకుంటే లేదా ఎవరైనా దొంగిలిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గానీ..వెంటనే డూప్లికేట్ చేయించుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2023, 10:56 AM IST
Pan card: పాన్‌కార్డు ఎన్ని రకాలు, పాన్‌కార్డు పోతే తక్షణం ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి

పాన్‌కార్డు అనేది దేశంలో ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంది. పదంకెల ఆల్ఫా న్యూమరిక్ సిరీస్‌లో ఉంటుంది. ఇదొక గుర్తింపు కార్డు లాంటిదే. పాన్‌కార్డు ఎన్నిరకాలు, పోగొట్టుకుంటే ఎం చేయాలనే వివరాలు తెలుసుకుందాం..

పాన్‌కార్డు రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి భారతీయ పౌరులకు ఇచ్చేది కాగా రెండవది విదేశీ పౌరులకు. దీనిపై భారత ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ట్యాక్స్ విధిస్తారు. పాన్‌కార్డు‌లో ఏదైనా సమాచారం చేర్చాలంటే అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. అదే సమయంలో పాన్‌కార్డు పోతే వెంటనే డూప్లికేట్ చేయించుకోవాలి.

నిత్య జీవితంలో అవసరమైన కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి పాన్‌కార్డు. పాన్‌ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్లిన అవసరం లేదు. డూప్లికేట్ పాన్‌కార్డు తీసుకోవచ్చు. పాన్‌కార్డు పోతే ముంందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత డూప్లికేట్ పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దీనికోసం కొన్ని దశలున్నాయి. వాటి ఆధారంగా పాన్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పాన్‌కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

పాన్‌కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html ఓపెన్ చేయాలి. పాన్‌కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. మీ ఆల్ఫాన్యూమరిక్ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ పుట్టినరోజు, జీఎస్టీఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ బాక్స్‌పై టిక్ చేయాలి. మీ ఫామ్ ఫిల్ చేసేందుకు క్యాప్చా ఎంటర్ చేయాలి.

ఎక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ద్వారా ఈ ప్రక్రియ చేస్తే ఫామ్ సమర్పించాక ఓటీపీ జారీ అవుతుంది. ఆ తరువాత కేవలం పీడీఎఫ్ డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఈ పాన్ డౌన్‌లోడ్ చేయవచ్చు. 

ప్రోసెసింగ్ ఫీ చెల్లించిన తరువాత పాన్‌కార్డు 15 రోజుల్లోగా డెలివరీ అవుతుంది. ఏ విధమైన ఫీజు లేకుండా మూడుసార్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాన్‌కార్డ్ దరఖాస్తు ఎన్ఎస్‌డీఎల్ ఈ గవర్నెన్స్ ద్వారా జమ అవుతుంది. 

Also read: LIC Credit Cards: ఎల్ఐసీ అందిస్తోంది ఇప్పుడు..క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం చెల్లించే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News