Earthquake News: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌‌లో భూకంపం.. ఢిల్లీలోనూ కంపించిన భూమి

Earthquake News Today: భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7.55 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. 5.9 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించినట్టు రిక్టార్ స్కేలుపై నమోదైంది. ఢిల్లీ వాసులు భూకంపం కారణంగా తమకు ఎదురైన అనుభవాలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 09:00 PM IST
Earthquake News: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌‌లో భూకంపం.. ఢిల్లీలోనూ కంపించిన భూమి

Earthquake News Today: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌‌తో పాటు ఉత్తర భారత దేశంలో పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లో భూకంపం ధాటికి మన దేశ రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. ఆఫ్గనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కి దక్షిణాన 79 కిమీ దూరంలో భూకంపం సంభవించగా.. దీని ప్రభావం పాకిస్థాన్ నుంచి భారత్ వరకు కనిపించింది. 

జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించిన సమాచారం మేరకు భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7.55 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. 5.9 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించినట్టు రిక్టార్ స్కేలుపై నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ ఖుష్ పర్వత ప్రాంతాల్లో భూమికి 200 కిమీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు కేంద్రం గుర్తించారు. 

 

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో భూమి కంపించినప్పటికీ.. అదృష్టవశాత్తుగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఢిల్లీ వాసులు భూకంపం కారణంగా తమకు ఎదురైన అనుభవాలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. 

ఇదిలావుంటే, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, సహా భారత్ తో సరిహద్దులు కలిగి ఉన్న ఏ భూభాగంలో భూకంపం సంభవించినా.. ఆ భూకంపం ప్రభావం ఢిల్లీలో కనిపిస్తుండటం, ఢిల్లీలోనూ భూమి కంపిస్తుండటం తరచుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆందోళన ఢిల్లీ వాసుల్లో కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి : Lockdown in India: దేశంలో మళ్లీ లాక్‌డౌన్.. 15 రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఇదిగో క్లారిటీ

ఇది కూడా చదవండి : Ram Temple inauguration: అయోధ్య రామాలయం ప్రారంభ తేదీ ఖరారు, ముహూర్తం ప్రకటించిన అమిత్ షా

ఇది కూడా చదవండి : CM KCR: సీఎం కేసీఆర్‌కు సర్ ఛోటురామ్ అవార్డు.. ఎందుకంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News