Rakul Preet Lover : సాంటా ఇచ్చిన గిఫ్ట్ అదే.. లవర్‌కు రకుల్ ప్రీత్ స్పెషల్ విషెస్

Rakul Preet Singh Lover Birthday రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లవర్ మీద ఓ పోస్ట్ వేసింది. జాకీ భగ్నానీ బర్త్ డే అంటూ రకుల్ వేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాంటా ఇచ్చిన గిఫ్ట్ అంటూ తన లవర్ గురించి రకుల్ చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 05:27 PM IST
  • రకుల్ ప్రీత్ లవర్ బర్త్ డే
  • జాకీ భగ్నానీతో రకుల్‌ పిక్ వైరల్
  • సాంటా ఇచ్చిన గిఫ్ట్ అంటూ పోస్ట్
Rakul Preet Lover : సాంటా ఇచ్చిన గిఫ్ట్ అదే.. లవర్‌కు రకుల్ ప్రీత్ స్పెషల్ విషెస్

Rakul Preet Singh Lover Birthday రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరమైనట్టు కనిపిస్తోంది. ఈ ఏడాదిలో కొండపొలం అంటూ రకుల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం ఘోరంగా పరాజయం చవిచూసింది. నితిన్‌ హీరోగా వచ్చిన చెక్ సినిమా సైతం బెడిసి కొట్టేసింది. అలా రకుల్ సినిమాలు తెలుగులో అంతగా ఆడటం లేదు. ఇప్పుడు రకుల్ కూడా తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టేసింది. అక్కడ కూడా రకుల్ సినిమాలేవీ అంతగా ఆడటం లేదు. ఇప్పుడు అయితే రకుల్ చేతిలో తెలుగు సినిమాలేవీ లేనట్టుగా కనిపిస్తోంది.

రకుల్ చేతిలో ప్రాజెక్టులేమీ లేకపోయినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో రకుల్ చేసే రచ్చ తగ్గడం లేదు. అందాల ఆరబోతలో రకుల్ హద్దులు దాటేస్తోంది. ఇప్పుడు రకుల్ కాస్త వర్కౌట్లకు తగ్గించినట్టుగా అనిపిస్తోంది. ఒకప్పుడు అయితే రోజులో ఇరవై నాలుగు గంటలు వర్కౌట్ల అంటూ కనిపించేది. కరోనా వచ్చిన సమయంలోనూ రకుల్ వర్కౌట్లను వదల్లేదు. యోగాలు చేసింది. వర్కౌట్లు చేసింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇప్పుడు రకుల్‌ సోషల్ మీడియాలో తన లవర్ గురించి చెబుతూ వచ్చింది. మధ్యలో రకుల్‌కు బ్రేకప్ జరిగిందనే రూమర్లు వచ్చాయి. లవర్‌ను పరిచయం చేసి ఇన్ని రోజులు అవుతోంది కానీ పెళ్లి విషయం మీద నోరు విప్పకపోవడంతో బ్రేకప్ జరిగిందంటూ రూమర్లు వచ్చాయి. కానీ తాజాగా తన లవర్ జాకీ భగ్నానీ బర్త్ డే సందర్బంగా వేసిన పోస్ట్‌తో ఆ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది.

సాంటా నాకు ఈ జీవితానికి ఇచ్చిన బహుమతి నువ్వే.. హ్యాపీ బర్త్ డే మై లవ్.. నా జీవితంలోకి సంతోషాన్ని, మనశ్శాంతిని తీసుకొచ్చినందుకు థాంక్స్.. నన్ను కూల్ చేస్తుంటావ్.. జీవితంలోని నీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను.. ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను అని రకుల్ తన ప్రేమను కురిపిస్తూ బర్త్ డే విషెస్ చెప్పింది.

Also Read : Samantha Ruth Prabhu : వారందరికీ నేను చెప్పదల్చుకున్నది ఇదే.. సమంత పోస్ట్ వైరల్

Also Read : చికెన్ బిర్యానీ తిని వెంటనే చనిపోయారు.. అసలు విషయం బయటపెట్టిన రవిబాబు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News