Budhaditya Rajyog In Makar: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు తమ రాశిని ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. దీని వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి 7న మకరరాశిలో సూర్య దేవుడు, మెర్క్యురీ కలయిక జరగనుంది. దీని వల్ల బుధాదిత్య రాజయోగం (Budhaditya Rajyog) ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ఇది 3 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేష రాశిచక్రం (Aries): బుధాదిత్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి పదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఈ సమయంలో వ్యాపారవేత్తల పెట్టుబడులు మీకు లాభిస్తాయి. ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.
మీన రాశిచక్రం (Pisces): బుధాదిత్య రాజయోగం మీకు శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీరు వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందుతారు.
ధనుస్సు రాశిచక్రం (Sagittarius): బుధాదిత్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. విదేశీ వ్యాపారం చేసే వారు అపారమై ధనాన్ని పొందుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్తులు విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది.
Also Read: Saturn Transit: 2023లో శని గమనంలో పెను మార్పు.. వీరి భవితవ్యం మారనుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook