Vinayaka Chaturthi 2022 December: హిందూ మతంలో చతుర్థి తిథిని వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ చతుర్థి తిథిని గణేష్ చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అని అంటారు. ఈ ఏడాది చివరి వినాయక చతుర్థి వ్రతం రేపు అంటే 26 డిసెంబర్ 2022, సోమవారం నాడు జరుపుకోనున్నారు. వినాయక చతుర్థి రోజున చంద్రుడిని చూసే సంప్రదాయం ఉంది. ఈ రోజున చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు. చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల గణేశుని అనుగ్రహం లభించడంతోపాటు మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. వినాయక చతుర్థి వ్రతాన్ని ఆచరించే విధానం, పూజా సమయం గురించ తెలుసుకోండి.
పూజకు అనుకూలమైన సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, పుష్య మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి డిసెంబర్ 26, సోమవారం ఉదయం 4.51 గంటలకు ప్రారంభమై... డిసెంబర్ 27న తెల్లవారుజామున 1.37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, వినాయక చతుర్థి వ్రతం 26 డిసెంబర్ 2022న జరుపుకుంటారు. వినాయక చతుర్థి వ్రతాన్ని ఆరాధించడానికి అనువైన సమయం డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11.20 నుండి మధ్యాహ్నం 01.24 వరకు ఉంటుంది. ఈ రోజున గణపతిని ఆచారాలతో పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
పవిత్రమైన యోగం
2022 సంవత్సరం వినాయక చతుర్థి చివరి రోజున చాలా పవిత్రమైన యోగం ఏర్పడుతోంది. ఈ యోగాలలో చేసే పూజలు, శుభకార్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి. డిసెంబర్ 26వ తేదీ సోమవారం సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం ఏర్పడుతున్నాయి. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 07:12 నుండి సాయంత్రం 04:42 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. మరోవైపు రవియోగం ఉదయం 07:12 నుండి సాయంత్రం 04:42 వరకు ఉంటుంది. ఇది కాకుండా అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 12.01 నుండి 12.42 వరకు మరియు అమృత కాలం - ఉదయం 7.27 నుండి 8.52 వరకు ఉంటుంది. వినాయక చతుర్థి నాడు ఉపవాసం ఉండటం వల్ల మీకు అపారమైన సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది
Also Read: Vaikuntha Ekadashi 2023: వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook