Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?

Tollywood Top Heroine in 2022 టాలీవుడ్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్లకు, డిజాస్టర్ల సినిమాలకు లంకె కుదరడం లేదు. హిట్ అయినవి పది ఉంటే.. పోయినవి తొంభై ఉన్నాయి. ఇక ఇందులో కొత్త హీరోయిన్లు కొంత మంది మెరిస్తే.. స్టార్ హీరోయిన్లు హిట్లు లేక వెలవెలబోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2022, 02:33 PM IST
  • ఐరన్ లెగ్‌గా మారిన పూజా హెగ్డే
  • స్టార్ హీరోయిన్లకు కలిసి రాని 2022
  • చిన్న హీరోయిన్లే లక్కీ చార్మ్స్
Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?

Tollywood Top Heroine in 2022 రష్మిక మందన, పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి వారు ఇప్పుడు సౌత్‌లో టాప్ స్టార్స్. సమంత, నయన్‌ సంగతి పక్కన పెట్టేస్తే.. ఈ నలుగురే ఇప్పుడు స్టార్ హీరోలకు ఆప్షన్లుగా ఉన్నారు. ఏ స్టార్ హీరో సినిమా తీసినా రష్మిక, పూజా, కీర్తి సురేష్‌ పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. సాయి పల్లవి మాత్రం తనకు నచ్చిన కథలను మాత్రం చేస్తూ వస్తుంటుంది. నయన్ కూడా అంతే. సమంత అయితే ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేనే లేదు. అయితే ఈ ఏడాది స్టార్ హీరోయిన్లకు అంతగా కలిసి రాలేదు.

రష్మిక మందన ఈ ఏడాది చేసిన తెలుగు సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫ్లాపుగా నిలిచింది. హిందీలో చేసిన గుడ్ బై, మిషన్ మజ్నులు కూడా అంతే. దీంతో రష్మికకు ఈ ఏడాది ఒక్క హిట్ కూడా లేకుండా పోయింది. ఇక కీర్తి సురేష్‌ సర్కారు వారి పాట అంటూ హిట్ కొట్టాలని చూసింది. కీర్తి కాస్త కొత్తగా, బోల్డ్‌గా కనిపించింది. జనాలు ఆమెను అలా యాక్సెప్ట్ చేయలేదు. సినిమా కూడా అంత బాగా లేకపోవడంతో కీర్తికి బ్యాడ్ లక్ వెంటాడినట్టు అయింది. ఓటీటీలో ఆమె చేసిన చిన్న చిత్రానికి మంచి స్పందన అయితే వచ్చింది.

ఈ ఏడాది మొత్తంలో పూజా హెగ్డేను చూసి మనం జాలి పడాల్సిందే. ఆమె చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. సర్కస్, రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఇక చివరకు బుట్టబొమ్మ కాస్త ఉత్తబొమ్మగా మిగిలిపోయింది. సమంత చేసిన యశోద హిట్ట్ అయినా కూడా ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. నయన్ చేసిన సినిమాలేవీ కూడా హిట్ అవ్వలేదు. ఓటీటీలో, సిల్వర్ స్క్రీన్ మీద నయన్ మ్యాజిక్ కనుమరుగైంది. గాడ్ ఫాదర్‌ సినిమాలో నయన్ పాత్రకి, చిరు చెల్లిగా చేయడం కూడా అంతగా సెట్ అవ్వలేదు.

స్టార్ హీరోయిన్ల పరిస్థితి అలా ఉంటే.. చిన్న హీరోయిన్లు కొత్త హీరోయిన్ల పరిస్థితి ఇంకోలా ఉంది. ఉప్పెనతో ఎగిసిన కృతి శెట్టి చివరకు అలలా వెనక్కి వెళ్లిపోయింది. ఆమె నటించిన మూడు సినిమాలు (మాచర్ల, వారియర్, ఆ అమ్మాయి గురించి) దారుణంగా పల్టీ కొట్టేశాయి. అలా ఆమె కెరీర్ కనుమరుగయ్యేట్టుంది. కేతిక శర్మ పరిస్థితి కూడా అంతే. అయితే శ్రీలీల మాత్రమే ఈ ఏడాది లక్కీ ఛార్మ్‌గా నిలిచింది. అనుపమ నటించిన కార్తికేయ 2, 18 pages సినిమాలు హిట్ అవ్వడంతో లక్కీ గాళ్‌గా నిలిచింది. కానీ ఆమె నటించిన రౌడీ బాయ్స్ డిజాస్టర్ అయింది. డీజే టిల్లు నేహా శెట్టి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎప్పటిలానే జాన్వీ కపూర్‌ బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతూనే వస్తోంది.

Also Read : Disaster Movies in Tollywood 2022 : ఈ ఏడాదిలో పెద్ద దెబ్బ కొట్టిన చిత్రాలు ఇవే.. ఆచార్య చెప్పిన గుణపాఠం

Also Read : Pooja Hegde Cirkus : కోలుకోలేకపోతోన్న బాలీవుడ్.. సర్కస్‌ కూడా డిజాస్టరే?.. రణ్‌వీర్‌, పూజా హెగ్డేల బ్యాడ్ లక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x