Kaikala Satyanarayana Death: పాత్రలకు ప్రాణం పోసిన విలక్షణ నటుడు.. కైకాల సత్యనారాయణ తొలి, చివరి సినిమాలు ఇవే!

Tollywood senior actor Kaikala Satyanarayana Last Movie. కైకాల సత్యనారాయణ దాదాపు 61 సంవ‌త్స‌రాల పాటు సినిమా రంగంలో ఉన్నారు. ఆరు దశాబ్దాల సుధీర్ఘ సినీ కెరీర్‌లో దాదాపుగా 780 చిత్రాల్లో నటించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 23, 2022, 10:03 AM IST
  • పాత్రలకు ప్రాణం పోసిన విలక్షణ నటుడు కైకాల
  • కైకాల తొలి, చివరి సినిమాలు ఇవే
  • 61 సంవ‌త్స‌రాల పాటు సినిమా రంగంలో
Kaikala Satyanarayana Death: పాత్రలకు ప్రాణం పోసిన విలక్షణ నటుడు.. కైకాల సత్యనారాయణ తొలి, చివరి సినిమాలు ఇవే!

Tollywood senior actor Kaikala Satyanarayana First and Last Movie: టాలీవుడ్ లెజండరీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యానారాయణ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. ఈరోజు వేకువజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు అయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే దిగ్గజాలు కృష్ణంరాజు, కృష్ణ మరణంతో మొదటి తరాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. 

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో 1935 జులై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. ఆ రోజుల్లోనే గుడివాడ కాలేజీలో గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశారు. అయితే చిన్నప్పటినుంచి నటనపై ఉన్న ఆసక్తితో.. స్కూల్, కాలేజీ చదువుతుండగానే కైకాల ఎన్నో నాటకాలు, స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనలోని టాలెంట్‌ను ప్రముఖ నిర్మాత డీఎల్‌ నారాయణ ముందుగా గుర్తించారు. అనంతరం 'సిపాయి కూతురు' సినిమాలో కైకాలకు అవకాశం ఇచ్చారు. దాంతో కైకాల వెండితెరకి పరిచయం అయ్యారు.

కైకాల సత్యనారాయణ దాదాపు 61 సంవ‌త్స‌రాల పాటు సినిమా రంగంలో ఉన్నారు. ఆరు దశాబ్దాల సుధీర్ఘ సినీ కెరీర్‌లో దాదాపుగా 780 చిత్రాల్లో నటించారు. సుధీర్ఘ సినీ కెరీర్‌లో హీరో, విలన్, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కైకాల నటించారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేశారు. పాత్రలకు ప్రాణం పోసి విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు కూడా ఆయనకు ఉంది. 

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబుతో కలిసి కైకాల సత్యనారాయణ ఎన్నో సినిమాలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి అగ్ర హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించారు. సుధీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో పాత్రల్లో ఆయన నటించారు. దుర్యోధనుడు, ఘటోత్కచుడు, యమధర్మరాజు, దుశ్శాసనుడు, భరతుడు, కర్ణుడు, రావణాసురుడి పాత్రల్లో మెప్పించారు. ఘటోత్కచుడుగా నట విశ్వరూపం చూపారు. 2019లో విడుదలైన `మహర్షి` సినిమాలో చివరిసారిగా వెండితెరపై కైకాల కనిపించారు. 

Also Read: IPL 2023 Auction: నేడే ఐపీఎల్‌ 2023 మినీ వేలం.. వేదిక, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!  

Also Read: Gold Price Today: 55 వేల చేరువలో బంగారం ధర.. 70 వేలు దాటిన వెండి ధర!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News