YSRCP Social Media: సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని.. అతడిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక సైతాన్ సైన్యంలా మారిందని మండిపడ్డారు. విష నాగులతో పాటు అనకొండను అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తన సోదరుడు వైఎస్ జగన్‌ను షర్మిల అనకొండతో పోల్చి విమర్శలు చేశారు.
Also Read: YS Sharmila: దీపం పథకంలో సగం మంది మహిళలకు కోత పెడతారా? బడ్జెట్‌పై షర్మిల విమర్శలు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌పై షర్మిల స్పందిస్తూ.. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలపై అరెస్ట్ అంశంపై కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాపై షర్మిల విరుచుకుపడ్డారు. జగన్‌తోపాటు అతడి సోషల్ మీడియా సైన్యంపై మండిపడ్డారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ తీరుపై కూడా ధ్వజమెత్తారు.
Also Read: Ys Sharmila Satires: అసెంబ్లీకు వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయండి
'పాలకపక్షం వైఖరి ఇలా ఉంటే.. జగన్ వైఖరి మరోలా ఉంది. జగన్‌కి ఇది భావ్యమేనా?' అని షర్మిల ప్రశ్నించారు. మిమ్మల్ని గెలిపించింది ప్రజలు.. మీకు భాధ్యత లేదా? అని నిలదీశారు. 'ప్రతిపక్ష హోదా లేకపోతే మైకూ ఇవ్వరట. మైకు ఇవ్వకపోవడం మీ స్వయంకృతాపరాధం' అని గుర్తు చేశారు. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? మీ అక్రమాలు, అవినీతిని ప్రజలు గమనించడంతోనే 11 సీట్లకు పరిమితం చేశారని వివరించారు.
'మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా' అని షర్మిల నిలదీశారు. అసెంబ్లీ వెళ్లకపోవడం అహంకారానికి నిదర్శనమని జగన్‌పై మండిపడ్డారు. 'మీకు ప్రజలు ఓట్లు వేసింది అసెంబ్లీకి వెళ్లడానికి కదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లు కాదా అని సందేహం వ్యక్తం చేశారు. 'జగన్‌కి అహంకారం ఉంటే ఎమ్మెల్యేలకు ఏమైంది? ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కాదు కదా మీకు ఓట్లు వేసింది? మీ అజ్ఞానం ఏమిటో బయటపడింది' అని తెలిపారు.
'బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ప్రభుత్వాన్ని ప్రశించేది ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు? సర్కార్ దందాలను ప్రశ్నించేది ఎవరు?' అనే సందేహాలు వైఎస్ షర్మిల వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయండంటూ సవాల్ విసిరారు.
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాపై స్పందిస్తూ.. 'సోషల్ మీడియాలో నేను ఒక బాధితురాలిని. నన్ను, సునీతను, అమ్మను ఎలా బడితే అలా మాట్లాడారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది జగన్ మోహన్ రెడ్డినే' అని షర్మిల కుండబద్దలు కొట్టారు. 'జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఇవి అప్పుడే ఆగేవి. సోషల్ మీడియాలో మా మీద అబద్ధాలు చెప్పడమే కాదు అక్రమ సంబంధాలు అంటగట్టారు. బూతులు కూడా తిట్టారు' అని వివరించారు.
'ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టి ఒక సైతాన్ సైన్యం తయారుచేశారు. ఇలాంటి వాటికి తెరపడాలి. మహిళలు రాజకీయాల్లో ఉండాలంటే భయపడే పరిస్థితికి తెచ్చారు. మా కుటుంబాల్లో కింద కామెంట్లు చదవొద్దు అనే చెప్పే పరిస్థితి ఉంది' అని షర్మిల వాపోయారు. 'వైసీపీ సోషల్ మీడియాలో పట్టుకున్న వాళ్లు విషనాగులు. కానీ వారి వెనుక ఉన్న అనకొండను పట్టుకోవాలి' అంటూ పరోక్షంగా జగన్ అంటూ డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలి