స్వచ్చంధ సంస్థలకు టి సర్కార్ గ్రాంట్ మంజూరు

                                      

Last Updated : Jun 29, 2018, 11:23 AM IST
స్వచ్చంధ సంస్థలకు టి సర్కార్ గ్రాంట్ మంజూరు

తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 17 స్వచ్ఛంధ సంస్థలకు గ్రాంట్ మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి వెల్లడించారు. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఫండ్ స్టేట్ లెవల్ కమిటి ఈ రోజు సమావేశమైంది. ఈ సందర్భంగా వివిధ జిల్లాలలో అనాధబాలలు, వృద్ధాశ్రమాలు, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్ మంజూరు చేశారు. దీనికితోడు సదురు సంస్థలకు 50 శాతం ఇచ్చే గ్రాంట్ ను 75 శాతానికి  పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు సీఎస్ డా.ఎస్ కె.జోషి వెల్లడించారు.

గ్రాంట్లు మంజూ చేయాలని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి విన్నపించాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ రోజు జరిగిన సమావేశంలో ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్ జ్యోతి, కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సోనిబాలాదేవి, డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Trending News