Chiranjeevi Vs Nandamuri Balakrishna : రెండో రౌండ్‌లోనూ ఓడిపోయిన బాలయ్య.. మెగాస్టార్ చిరు క్రేజ్ తగ్గేదేలే

Suguna Sundari Song Youtube Records in 24 Hours సుగుణ సుందరి, చిరంజీవి శ్రీదేవీ పాటల మధ్య ప్రస్తుతం పోటీ నడుస్తోంది. అయితే ఈ రెండు పాటలు ఇరవై నాలుగు గంటల్లో క్రియేట్ చేసిన రికార్డుల మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 06:26 PM IST
  • సోషల్ మీడియాలో చిరు వర్సెస్ బాలయ్య
  • బాలయ్య, చిరు పాటల మధ్య పోరు
  • రెండు పాటల్లోనూ చిరుదే పై చేయి
Chiranjeevi Vs Nandamuri Balakrishna : రెండో రౌండ్‌లోనూ ఓడిపోయిన బాలయ్య.. మెగాస్టార్ చిరు క్రేజ్ తగ్గేదేలే

Suguna Sundari Song Youtube Records మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఉండే వార్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ ఇద్దరూ సంక్రాంతి బరిలోకి దిగుతుండటంతో ఆ పోటీ మరింతగా తీవ్రరూపం దాల్చుతోంది. ప్రతీ విషయంలో అభిమానులు పోల్చి చూస్తున్నారు. టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు ఇలా ప్రతీ విషయంలో అభిమానులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ దాన్ని పోల్చుతూ తమ హీరో గొప్పంటే.. తమ హీరో గొప్ప అంటూ ఫ్యాన్ వార్‌కు దిగుతున్నారు.

అయితే ఇప్పుడు పాటల పోటీలు నడుస్తున్నాయి. వీర సింహా రెడ్డి నుంచి విడుదలైన జై బాలయ్య పాట కంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య బాస్ పార్టీకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇరవై నాలుగు గంటల్లో బాస్ పార్టీ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఫస్ట్ రౌండ్‌లో బాలయ్య మీద చిరంజీవి గెలిచినట్టు అయింది.

ఇప్పుడు రెండో పాటకు సంబంధించిన పోటీ అయింది. బాలయ్య సినిమాలోని సుగుణ సుందరి పాటకు మంచి స్పందన వచ్చింది. బాలయ్య స్టెప్పులకు అంతా ఫిదా అయ్యారు. ఇక చిరంజీవి శ్రీదేవీ పాటకు చిరు, శ్రుతి హాసన్ వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. ఈ రెండో రౌండ్‌లోనూ బాలయ్యే ఓడిపోయాడు. చిరంజీవి నెగ్గాడు.

సుగుణ సుందరి పాటకు ఇరవై నాలుగు గంటల్లో 4.83 మిలియన్ల వ్యూస్ రాగా.. 155.2K లైక్స్ వచ్చాయి. ఇక అదే సమయంలో చిరంజీవి శ్రీదేవీ పాటకు 6.16 మిలియన్ల వ్యూస్ రాగా.. 160.3K లైక్స్ వచ్చాయి. అలా ఈ రెండు పాటల్లో చిరంజీవి ముందున్నాడు. ఇప్పుడు బాలయ్య సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ రావాల్సి ఉంది. వాటిలో ఎవరు నెగ్గుతారో చూడాలి.

Also Read : Nayanthara-Jr NTR : ప్రభాస్ చిన్న పిల్లాడు.. రవితేజతో గ్యాప్ వచ్చింది.. నయనతార కామెంట్స్ వైరల్

Also Read : Nandamuri Taraka Ratna : ఎన్టీఆర్‌ది నందమూరి రక్తం.. యంగ్ టైగర్‌పై తారకరత్న కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News