సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు అల్లం వినియోగం అధికమౌతుంటుంది. చలి, ఇతర వ్యాధుల్నించి కాపాడుకునేందుకు అల్లం వివిధ రూపాల్లో తీసుకుంటుంటాం. కానీ రోజుకు పరిమిత మోతాదులోనే అల్లం తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. అది ఎంత మొత్తం తీసుకోవాలి, లేకపోతే కలిగే దుష్పరిణామాలేంటో చూద్దాం.
ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పకుండా లభిస్తుంది అల్లం. అల్లంతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలుంటాయి. గొంతు సంబంధిత సమస్యలు, కడుపు, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులకు చెందిన చాలా రోగాలకు అల్లం మంచి పరిష్కారం. అటు ఆయుర్వేదం వైద్యులు కూడా ఇదే చెబుతున్నారు. అయితే అల్లంతో దుష్పరిణామాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా..కానీ నిజమే. అతిగా తింటే ఏదైనా అనర్దమే. ఈ నేపధ్యంలో అల్లం రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
అల్లం ప్రతిరోజూ నియమిత మోతాదులో తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోకూడదని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె దడ అధికమౌతుంది. అల్లం ఎక్కువగా తింటే..కంటి చూపు దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య, లో బీపీ సమస్యలు ఉత్పన్నమౌతాయి. అల్లం పరిమితి దాటి తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలే కాకుండా విరేచనాలు, గర్భస్రావం కూడా తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు అల్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అల్లంం రక్తపోటుకు కారణమై..తీవ్ర అలసట కల్గిస్తుంది. అందుకే డయాబెటిస్ రోగులు వైద్యుని సలహా మేరకే అల్లం తీసుకుంటే మంచిది. గర్భిణీ స్త్రీలు కూడా అల్లం వినియోగానికి దూరంగా ఉంటే మంచిది. అల్లం ఎక్కువగా తింటే గర్భస్రావమయ్యే ప్రమాదముంది. గుండెల్లో మంట, గ్యాస్ తన్నడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అల్లం క్రమం తప్పకుండా అదే పనిగా తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. స్కిన్, ఐ ఎలర్జీలు ఎదురౌతాయంటున్నారు వైద్య నిపుణులు. కళ్లు ఎర్రబడటం లేదా దురద, పెదవుల్లో వాపు, గొంతులో అసౌకర్యం ఇవన్నీ అల్లం అతిగా తింటే కలిగే దుష్పరిణామాలే. ఇక అల్లం అతిగా తీసుకుంటే కడుపు నొప్పి సంభవిస్తుంది. సహజంగా అల్లం పరగడుపున తీసుకుంటాం. పరగడుపున ఎక్కువ అల్లం తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook