విశాఖలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో భాగంగా ఆయన పలు వాగ్దానాలు చేశారు. రజక కులస్తులను ఎస్సీలుగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే పసుపు కుంకుమ క్రింద డ్వాక్రా మహిళలకు రూ.10,000 అందజేస్తామని అన్నారు.
అదేవిధంగా 11 అంకెల సంఖ్యతో ప్రతీ భూమి హక్కుదారుడికి కూడా భూదార్ ఇస్తామని అన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి రూ.1250 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖ నగరాన్ని క్రీడా నగరంగా మార్చడానికి శతవిధాల ప్రయత్నిస్తామని.. అందుకు గాను 1600 ఎకరాలు సేకరిస్తున్నామని ఆయన అన్నారు.
పేదవాడికి అండగా ఉండాలన్నదే తెలుగు దేశం పార్టీ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా పింఛను ఇవ్వాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రజకులను ఎస్సీల్లో చేరుస్తాం: చంద్రబాబు