Shani Ki Sade Satishani 2023: శని దేవుని పేరు వినగానే మనస్సులో ఏదో భయం మొదలవుతుంది. శని దేవుని చెడు ప్రభావం వల్ల చాలామంది కష్టాల పాలవుతున్నారు. జాతకంలో శని గ్రహ స్థానం దిగువన ఉంటే తీవ్ర నష్టాలే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర పేర్కొన్నారు. శని దేవుని జ్యోతిష్య శాస్త్రంలో న్యాయ దేవతగా చెప్పుకుంటారు. కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి న్యాయదేవత అని అంటారు. అయితే శని చెడు ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న వారు శని దేవునికి ఇష్టమైన దేవత మూర్తులను పూజించడం వల్ల శని దేవుని ఆశీర్వాదం కలిగి మంచి జీవితంలో మంచి ప్రయోజనాలు చేకూరతాయి. ఏ దేవతలను పూజించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పౌరాణిక గ్రంథాల ప్రకారం శని దేవుడు ఒక న్యాయ దేవత.. ఆయన మంచి కర్మలను చేసే వారిపై మంచి ప్రభావాన్ని చూపించి ధనవంతులను చేసేందుకు ఆయన అనుగ్రహం తోడవుతుంది. అంతే కాకుండా శని గ్రహం రాశుల సంచారం చేయడం వల్ల ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 17న శని మహారాజు కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి మకర, కుంభ, మీన రాశుల్లో శనిదేవుని సడే సతి ప్రారంభమవుతుంది.
శని దేవుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల కర్కాటక వృశ్చిక రాశి వారికి శని దేవుని ధైయా ప్రారంభమవుతుంది. దీంతో శని దేవుని చెడు ప్రభావం తొలగిపోయి మంచి ప్రభావం మొదలవుతుంది. ఈ క్రమంలోని మంచి ఫలితాలు కలగడమే కాకుండా ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ఈ సంచార క్రమంలో ముఖ్యంగా కృష్ణుని భక్తులకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దేవుడు కుంభరాశిలోకి సంచారం చేసిన తర్వాత కృష్ణుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుటుంబంలో శాంతి నెలకొంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
శివ భక్తులకు కూడా సంచారం కారణంగా శని ఆశీర్వాదాలు, అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో శివ భక్తులంతా శని దేవుని పూజించడమే కాకుండా శివ నామస్మరణ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా అనుగ్రహం కూడా పొందుతారు.
మంగళవారం రోజున శని దేవుని కాకుండా హనుమంతున్ని కూడా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మంగళవారం రోజున శని దేవునితో పాటు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శని చెడు ప్రభావం దూరమవుతుంది. అంతేకాకుండా చెడు ప్రభావం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read: Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు
Also Read: Health Insurance: తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలను చెక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Shani Dev: శని దేవునికి ఇష్టమైన ఈ దేవతలను పూజిస్తే ఆర్థికంగా బలపడడం ఖాయం..