Exit Polls 2022: హిమాచల్‌లో బీజేపీపై వ్యతిరేకత, కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా నేనా పోటీ

Exit Polls 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ సంస్థలు గుజరాత్‌లో మరోసారి బీజేపీకు పట్టం కడుతుంటే..హిమాచల్ ప్రదేశ్‌లో నువ్వా నేనా పోటీ ఉందని చెబుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2022, 07:52 PM IST
Exit Polls 2022: హిమాచల్‌లో బీజేపీపై వ్యతిరేకత, కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా నేనా పోటీ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో ఊహించినట్టే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకు పట్టం కడుతున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం నువ్వా నేనా రీతిలో పోటీ నెలకొంది. పీపుల్స్ పల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి..

కాంగ్రెస్ పార్టీకు 29-39 స్థానాలు, బీజేపీకు 27-37 స్థానాలు రావచ్చని..ఇతరులు 2-5 స్థానాలు గెల్చుకోవచ్చని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేస్తోంది. ఇక ఓట్ల శాతం విషయంలో కాంగ్రెస్ పార్టీ 45.9 శాతం, బీజేపీ 45.5 శాతం, ఆప్ 2.1 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు తెచ్చుకోవచ్చని అంచనా. అంటే బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 0.4 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.

ప్రియాంకా గాంధీ చేసిన ప్రచారం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు కలిసొచ్చిన అంశంగా తెలుస్తోంది. ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ కారణమని 24 శాతం మంది, రెండు ప్రభుత్వాలు కారణమని 45 శాతం మంది అభిప్రాయపడ్డారని పీపుల్స్ పల్స్ సంస్థ తెలిపింది. యాపిల్ రైతులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెద్దపీట వేయడం కూడా ఓ కారణంగా పీపుల్స్ పల్స్ సంస్థ చెబుతోంది. 

2017లో జరిగిన ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు కోల్పోయింది. అదే సమయంలో 1985 నుంచి ఇప్పటివరకూ హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండవసారి గెలవలేదు. నాటి ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ 4.2 శాతం ప్లస్ అవుతుండగా, బీజేపీ 3 శాతం మైనస్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ నుంచి 14 మంది తిరుగుబాటు అభ్యర్ధులు రంగంలో ఉండటం కూడా మరో కారణంగా పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కూడా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పడుతోంది. 

హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న 55 లక్షలమంది ఓటర్లలో 2.7 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులే. అదే సమయంలో ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, యాపిల్ పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం, అభివృద్ధి, అవినీతి ప్రధాన సమస్యలుగా పీపుల్స్ పల్స్ పోల్ సర్వే తెలిపింది. 

హిమాచల్ ప్రదేశ్‌లో పీపుల్స్ పల్స్ సంస్థ నవంబర్ 15 నుంచి 22 వరకూ 24 అసెంబ్లీ స్థానాల్లో 96 పోలింగ్ స్టేషన్లలో సర్వే నిర్వహించి..1920 శాంపిల్స్ సేకరించింది. 

Also read: Gujarat Exit Poll Results: గుజరాత్‌లో మళ్లీ బీజేపీకే పట్టం, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News