ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై ఈడీ దృష్టి సారించింది. పలు షెల్ కంపెనీల ఏర్పాటుతో 234 కోట్లను దారిమళ్లించినట్టుగా ఈడీ అభియోగాలు మోపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-2019 సమయంలో యువతకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనిచేసింది. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాల్ని కల్పించడమే ఈ సంస్థ ఉద్దేశ్యం. గుజరాత్ రాష్ట్రంలో సీమెన్స్ సంస్థ ఇదే తరహాలో పనిచేసింది. ఈమేరకు సీమెన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ 3, 350 కోట్ల రూపాయలు కాగా, ఇందులో పదిశాతం అంటే 370 కోట్లు ప్రభుత్వ వాటాగా ఉంది. ప్రభుత్వ వాటా 370 కోట్ల నుంచి 234 కోట్లను వివిధ షెల్ కంపెనీల ఏర్పాటుతో దారిమళ్లించినట్టుగా ఈడీ అభియోగాలున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఇదే అంశం వెలుగులోకి వచ్చింది.
ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న 26మందికి ఈడీ నోటీసులు పంపింది. రేపు హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావల్సి ఉంది. ఈ కేసులో మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్ డి కృష్ణప్రసాద్‌లకు కూడా నోటీసులు అందాయి.
Also read: Droupadi Murmu : ఏపీ పర్యటనకు ద్రౌపది ముర్ము.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook