King Cobra Bath Viral Video: ప్రతిసారీ ఇంటర్నెట్‌లో విచిత్రమైన సంఘటనలకు సంబంధించి వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తే మరికొన్ని భయపెడుతున్నాయి. ఈ వైరల్‌గా మారిన వీడియోల్లో చాలా వరకు జంతువులు, పాములకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించి అతి భయంకరమైన వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలను చూసి చాలా మంది నెటిజన్లు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇటివలే నెట్టింట వైరల్ అవుతున్న 22 సెకన్ల నిడివి గల పాముకు సంబంధించిన వీడియోను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఈ వీడియోను చూస్తే అందులో వ్యక్తి పాముకు స్నానం చేపిస్తున్న సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ వ్యక్తి పామును శుభ్రం చేసే క్రమంలో బకెట్‌లోని మగ్గుతో దాని పై నీరు పోయడం సన్నివేశాలు మీరు చూడొచ్చు. అది పెంచుకున్న పాము కావడంతో ఆతన్ని కాటేయలేపోయింది. అయితే ఇలాంటి వీడియోలను మనం తరచుగా చూసినప్పటికీ ఇది ఓ ప్రత్యేకమైన వీడియోనే. ఎందుకంటే పాముకు నీరు తాగించడం చాలా సులభమైనప్పటికీ దానికి స్నానం చేయించడం కష్టమైన పనేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
इतने ठंड में बेचारे सांप को पानी से नहला रहा है 🥲🐍🙏 pic.twitter.com/DtkrL4xiW3
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 2, 2022
అయితే ఈ వీడియోను మీరు గమనిస్తే పాము ఆ వ్యక్తి పట్టుకున్న మగ్గుకు కాటేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఏ మాత్రం కాటేయదు. ఒక వేళా ఈ కింగ్ కోబ్రా కాటేస్తే మనిషి చనిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని కాటు చాలా ప్రమాదకరం. ఈ నాగుపాములు సాధారణంగా 8 అడుగుల నుంచి 12 అడుగులుంటాయి. ఇవి ఎక్కవగా అమెరికాలో అమెజన్ అడవుల్లో జీవిస్తాయి. ఈ కింగ్ కోబ్రాలు చాలా వరకు మనుషులకు హాని కలిగించేవే..కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది.
22 సెకన్ల గల వీడియోను 'జిందగీ గుల్జార్ హై' ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటి వరకు 24వేలకు పైగా వీక్షించగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లైతే పాముకు స్నానం చేయించడం ఏంటి..? అది కాటేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్తం కురిపిస్తున్నారు.
Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు
Also Read: Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook