Horoscope Today 3 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు వారికి ధన వ్యయం తప్పదు!

Today Astrological prediction for 3 December 2022. సింహం, మకర రాశుల వారికి మిశ్రమ కాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారికి నేడు అనవసర ఖర్చులు ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 3, 2022, 06:22 AM IST
  • 3 November 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఆ రెండు వారికి ధన వ్యయం తప్పదు
Horoscope Today 3 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు వారికి ధన వ్యయం తప్పదు!

Horoscope Today 3 December 2022: మేషం (Aries): నూతనంగా ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకుసాగితేనే ఫలితాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ ఆరాధన చదివితే మంచిది.

వృషభం (Taurus): కష్టపడితేనే ఫలితాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికీ ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

మిథునం (Gemini): పట్టుదలతో చేసే పనుల్లో విజయాన్ని అందుకుంటారు. పై అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబంతో హాయిగా గడుపుతారు. శ్రీరామనామాన్ని జపించండి.

కర్కాటకం (Cancer): అవగాహనతో చేసే పనులు ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు పరిగణలోకి తీసుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహం (Leo): నూతనంగా ప్రారంభించబోయే పనుల్లో క్రమశిక్షణ అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అధిక ధన వ్యయం తప్పదు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత బాగుంటుంది. సాయి సందర్శనం ఉత్తమం.

కన్య (Virgo): వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక పనుల్లో వెనకడుగు వేయకండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. గోవింద నామాలు చదవడం మంచిది.

తుల (Libra): శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాదాల జోలికి వెళ్ళకండి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

వృశ్చికం (Scorpio): అన్ని రంగాల వారికీ మంచి ఫలితాలు ఉన్నాయి. స్నేహితుల, బంధుమిత్రుల సాయం అందుతుంది. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయస్వామి సందర్శనం మంచిది. 

ధనస్సు (Sagittarius): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారితో మంచిగా ఉండడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

మకరం (Capricorn): ప్రతి పనిలో క్రమశిక్షణ అవసరం. అధిక ధన వ్యయం తప్పదు. ఎవరితోనూ వివాదాలకు పోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్త. సాయి సందర్శనం ఉత్తమం.

కుంభం (Aquarius): అన్ని రంగాల వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సమయాల్లో వెనక్కి తగ్గడం మంచిది. ప్రయాణాలు చేస్తారు. బంధువులను కలుస్తారు. నవగ్రహ శ్లోకాన్ని చదవాలి.

మీనం (Pisces): కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. మీకు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఈశ్వర సందర్శనం మంచిది. 

Also Read: Telangana Weather: తెలంగాణ‌లో పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. రాబోయే ఐదురోజుల పాటు..!

Also Read: Hindu Girls Marriage Age: హిందూ అమ్మాయిల పెళ్లి, సంతాన యోగంపై ముస్లిం ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News