Horoscope Today 2 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు!

Today Astrological prediction for 2 December 2022. ధనస్సు, కుంభ రాశుల వారికి మిశ్రమ కాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారు ఆవేశంలో అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు .   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 2, 2022, 06:31 AM IST
  • 2 November 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు
Horoscope Today 2 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు!

Horoscope Today 2 December 2022: మేషం (Aries): నూతనంగా ప్రారంభించే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో కలహాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది.

వృషభం (Taurus): ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం. 

మిథునం (Gemini): అనుకూల సమయం. మంచి కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (Cancer): పట్టుదల చాలా అవసరం. ఉద్యోగంలో పై అధికారులతో బాగా వ్యవహరించాలి. శత్రువులతో జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. 

సింహం (Leo): కస్టపడి పనిచేస్తే విజయం మీదే. శ్రమ అధికం అవుతుంది. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యాన్ని నిత్యం కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కన్య (Virgo): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన చేస్తే మంచిది.

తుల (Libra): ఇష్టమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

వృశ్చికం (Scorpio): నూతనంగా చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ప్రతి పనిలో ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ ధ్యానశ్లోకం చదివితే మంచిది. 

ధనస్సు (Sagittarius): రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తేనే ఫలితాలు ఉన్నాయి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరుని సందర్శనం శుభప్రదం.

మకరం (Capricorn): శుభకాలం నడుస్తోంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మంచి లాభాలు ఉన్నాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది. 

కుంభం (Aquarius): నాథానంగా ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మంచిది. 

మీనం (Pisces): అన్ని పనుల్లో ఫలితాలను సాధిస్తారు. ఇంటికోసం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రయాణ సూచన ఉంది. శివారాధన శుభకరం. 

Also Read: Plastic Ban: ఏపీలో ప్లాస్టిక్ నిషేధం ఇకపై మరింత కఠినంగా, భారీగా జరిమానాలు

Also Read: PM Modi Convoy: పిఎం మోదీ రోడ్‌షోలోకి అంబులెన్స్ ఎంట్రీ.. అప్పుడేం జరిగిందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News