Asian Suniel and Mahesh Babu's joint venture Minerva Coffe Shop Grand opening Tomorrow: ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక సందర్భాల్లో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఆయన తల్లి ఇందిరాదేవి అనారోగ్య కారణాలతో మరణించడం, ఇటీవల ఆయన తండ్రి కృష్ణ అనారోగ్య కారణాలతో మరణించడం అందరికీ తెలిసిందే. దీంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
అయితే ఎట్టకేలకు మహేష్ బాబు వ్యాపారానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెండు రెస్టారెంట్లు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అది ఎట్టకేలకు ఆ వ్యాపార సంస్థ ప్రారంభమయ్యే సమయం వచ్చేసింది. ఏషియన్ గ్రూప్స్ అధినేత ఏసియన్ సునీల్ మహేష్ బాబు సంయుక్తంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారు.
ఏషియన్ సునీల్ అలాగే నమ్రత పేరు మీద ఏషియన్ నమ్రత పేరుతో ఒక హోటల్స్ చైన్ ప్రారంభిస్తున్నారు. ఈ రెస్టారెంట్ కు మినర్వా కాఫీ షాప్ అనే పేరు పెట్టారు. టిఆర్ఎస్ ఆఫీస్ బంజారాహిల్స్ దగ్గరలో ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి ఏంబిమాల్ నడుపుతున్నారు. ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో మెహర్ రమేష్ తో కలిసి మహేష్ బాబు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
వారితో వ్యాపారం లావాదేవీలలో ఒక్క రూపాయి కూడా తేడా రాకపోవడం ఏషియన్ సునీల్తో పెరిగిన సాన్నిహిత్య నేపథ్యంలోనే మహేష్ బాబు ఈ రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు ప్రారంభం కాబోతున్న ఈ రెస్టారెంట్ తో పాటు జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే మరో రెస్టారెంట్ కూడా ప్రారంభించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే అది ఏ ప్రాంతంలో ప్రారంభం కాబోతుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. మొత్తం మీద తీవ్ర దుఃఖంతో మునిగిపోయిన మహేష్ బాబు ఇంట్లో ఆయన వ్యాపారానికి సంబంధించి ఒక ప్రారంభోత్సవం జరగబోతూ ఉండడం కాస్త ఆయన అభిమానులకు ఆనందం కలిగించే విషయమే అని చెబుతున్నారు.
Also Read: Pandav Nagar Murder Case: అంజన్ దాస్ హత్యను బయట పెట్టిన శ్రద్ధ..అలా ఎలా జరిగిందంటే?
Also Read: I Love You Suma: సుమకు లైవ్లో ఐ లవ్యూ చెప్పిన కుర్రోడు... మాములుగా లేదుగా ఇది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook