Sara Ali Khan and Shubman Gill spotted together in Flight: బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్, టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సారా, శుభ్‌మన్ డేటింగ్‌లో ఉన్నారని నెట్టింట కోడై కూస్తోంది. ఇందుకు కారణం.. వీరిద్దరూ పార్టీ, పబ్, రెస్టారెంట్ అంటూ జంటగా షికార్లు కొట్టడమే. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో సారా, శుభ్‌మన్ డిన్నర్ చేస్తున్న ఫొటోలు బయటకు రావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
రెస్టారెంట్ ఘటన తర్వాత సారా అలీ ఖాన్, శుభ్‌మన్ గిల్ ఒకే హోటల్ నుంచి బయటకు వచ్చారు. ఇందుకు సమందించిన ఫొటోస్ బయటికి రావడంతో.. ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని మరోసారి వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సారా, శుభ్‌మన్ ఒకే ఫ్లైట్ ఎక్కారు. దాంతో ఇద్దరు నిజంగానే డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అలా దొరికిపోయారు అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గిన్‌ను సారాతో డేటింగ్ నిజమేనా అడగ్గా.. కావొచ్చు అని హింట్ ఇచ్చాడు. ఈ డేటింగ్ వ్యవహారంపై సారా అలీ ఖాన్ లేదా శుభ్‌మన్ గిల్ స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఇక సారా ముందుగా యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌ను ప్రేమించగా.. వీరిద్దరూ 2020లో విడిపోయినట్లు నెట్టింట వార్తలు వచ్చాయి. మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్‌తో గిల్ లవ్‌లో పడగా.. వీరి ప్రేమాయణం ఎంతోకాలం సాగలేదు. రెండోసారైనా సారా, శుభ్‌మన్ లవ్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. మొదటి వన్డేలో ఓపెనింగ్ చేసిన గిల్.. 65 బంతుల్లో 50 రన్స్ చేశాడు. ఇక రెండో వన్డేలో 42 బంతుల్లో 45 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైయింది. మ్యాచ్ రద్దైయ్యే సమయానికి భారత్ 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 రన్స్ చేసింది. గిల్ (45), సూర్యకుమార్ (34) క్రీజులో ఉన్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. మూడో వన్డే బుధవారం (నవంబర్ 30) జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. సిరీస్ 1-1తో సమం అవుతోంది. లేదంటే సిరీస్ కివీస్ కైవసం చేసుకుంటుంది.
Also Read: అదేపనిగా టీవీ చూస్తున్నాడని.. కుమారుడికి పేరెంట్స్ కఠిన శిక్ష! అచ్చు సినిమా మాదిరే
Also Read: Yadadri Thermal Power Plant: నేడు దామరచర్లకు సీఎం కేసీఆర్.. యాదాద్రి థర్మల్ పనుల పురోగతిపై పరిశీలన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.