Shreyas Iyer Record: శ్రేయస్‌ అయ్యర్ అరుదైన రికార్డు.. ఏ టీమిండియా క్రికెటర్‌కు సాధ్యం కాలేదు!

Shreyas Iyer joins Ramiz Razas Elite List. న్యూజిలాండ్‌ గడ్డపై వన్డేల్లో వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 25, 2022, 02:31 PM IST
  • న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ
  • శ్రేయస్‌ అయ్యర్ అరుదైన రికార్డు
  • ఏ టీమిండియా క్రికెటర్‌కు సాధ్యం కాలేదు
Shreyas Iyer Record: శ్రేయస్‌ అయ్యర్ అరుదైన రికార్డు.. ఏ టీమిండియా క్రికెటర్‌కు సాధ్యం కాలేదు!

Shreyas Iyer joins Ramiz Razas Elite List: టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్‌ అయ్యర్‌ వన్డే ఫార్మాట్‌లో దుమ్ము రేపుతున్నాడు. గత ఎనిమిది మ్యాచ్‌లలో అయ్యర్ పరుగుల వరద పారిస్తున్నాడు. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కూడా మరో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ఇప్పటివరకు ఏ టీమిండియా క్రికెటర్‌కు సాధ్యం కానీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌ గడ్డ మీద వన్డేల్లో వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

న్యూజిలాండ్‌ గడ్డ మీద వన్డేల్లో వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కూడా సాధ్యం కాలేదు. కేవలం 33 వన్డేలు ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ ఈ రికార్డు అందుకున్నాడు. న్యూజిలాండ్‌ గడ్డపై వన్డేల్లో అయ్యర్‌ 103 (107), 52 (57), 62 (63), 51*(57), 80 (76) స్కోర్లు చేశాడు. 

న్యూజిలాండ్‌ గడ్డపై వన్డేల్లో వరుసగా నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు సాధించిన రెండో విదేశీ క్రికెటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ రమీజ్‌ రాజా అగ్రస్థానంలో ఉన్నాడు. గత ఎనిమిది వన్డేల్లో భారత్‌ తరఫున అయ్యర్‌ 5 అర్ధ శతకాలు, ఒక సెంచరీ చేశాడు. అయ్యర్ చివరి ఎనమిది ఇన్నింగ్స్‌లలో 80, 54, 63, 44, 50, 113 నాటౌట్‌, 28 నాటౌట్‌, 80 స్కోర్లు బాదాడు. అయ్యర్ స్కోర్లు చూస్తే రానున్న వన్డే ప్రపంచకప్ 2023లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (72), శ్రేయస్‌ అయ్యర్‌ (80), శుభ్‌మన్ గిల్‌ (50) హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్‌ సౌథీ తలో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో కివీస్ 40 ఓవర్లలో మూడు వికెట్స్ కోల్పోయి 244 రన్స్ చేసింది. న్యూజిలాండ్‌ విజయానికి ఇంకా 56 బంతుల్లో 63 రన్స్ కావాలి. క్రీజులో లాతమ్ (102), కేన్ (77) ఉన్నారు. 

Also Read: Shikhar Dhawan Record: న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ.. దిగ్గజాల సరసన శిఖర్‌ ధావన్‌!

Also Read: December 2022 Bank Holidays: డిసెంబర్ నెలలో 13 రోజులు సెలవులు.. బ్యాంకులకు వెళ్లేవారు ఈ డేట్స్ చెక్ చేసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News