తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అఖిలప్రియ స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఖండించిన ఆమె.. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. ఆళ్లగడ్డ స్థానాన్ని మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తంచేస్తూ ఆ తర్వాత మిగతా వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టానికే వదిలేస్తానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను సైతం వెనక్కు తీసుకునే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా అఖిలప్రియ తేల్చిచెప్పారు.
దేశంలో మహిళలకు, మైనర్ బాలికలు రక్షణ లేదు. అందుకే ఒక సగటు మహిళగా, మహిళా మంత్రిగా ప్రధానిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప ఆయనను వ్యక్తిగతంగా విమర్శించే ఉద్దేశం కానీ స్థాయి ఆ కానీ తనకు లేవని మంత్రి అఖిలప్రియ మీడియాకు వివరణ ఇచ్చారు. 13 సంవత్సరాల వయస్సుపైబడిన మైనర్ బాలికలపై అత్యాచారం జరిగితే బీజేపీ ప్రభుత్వం వారిని పట్టించుకోదా ? అని ఈ సందర్భంగా ఆమె మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించారు.