వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో అత్యంత రహస్యంగా కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus Nord N20 SE. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
వన్‌ప్లస్ కంపెనీ ఇండియాలో ఇటీవల OnePlus Nord N20 SE లాంచ్ చేసింది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా స్టైలిష్‌గా, అద్భుత ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో 14,990 రూపాయలకు, అమెజాన్‌లో 14,588 రూపాయలకు అందుతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా ఇంకా లాంచ్ చేయలేదు. ఆన్లైన్ షాపింగ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. అధికారికంగా లాంచ్ కాకపోవడంతో చాలామందికి ఇంకా తెలియదు. మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచన ఉంటే..ఇదే మంచి ప్రత్యామ్నాయం.
OnePlus Nord N20 SE ఫీచర్లు
OnePlus Nord N20 SEలో అద్భుతమైన ఫీచర్లు, ప్రత్యేకతలున్నాయి. ఇందులో 6.56 ఇంచెస్ ఎల్సిడీ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తోంది. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో జి35 ఆక్టాకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది.
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ అనేది కెమేరాపరంగా చాలా క్రేజ్ కలిగిన ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రేర్ డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంది. ఇక బ్యాటరీ అయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
Also read: PAN Card: పాన్‌కార్డు - ఆధార్‌కార్డు లింక్ చేశారా..నాలుగు నెలలే మిగిలుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook