BJP MP Dharmapuri Aravind request CM KCR to Tap MLC Kavitha Phone: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు శుక్రవారం (నవంబర్ 18) ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎంపీ అరవింద్ నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను టీఆర్‌ఎస్ శ్రేణులు ధ్వంసం చేసాయి. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేయడమే కాకుండా.. అరవింద్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకుని పరువురిని అరెస్ట్ చేశారు. దాంతో అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దాడి సమయంలో ఇంట్లో ఎంపీ ధర్మపురి అరవింద్ అమ్మగారు ఉన్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు ఇంట్లోని మహిళా సిబ్బందిని రాళ్లతో కొట్టారు. దాంతో అరవింద్ అమ్మగారు, సింబ్బంది భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ నగరంలో లేరు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆపై నిజామాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి.. టీఆర్‌ఎస్ పార్టీ మహిళపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
'దాడి జరిగినపుడు నేను దిశ సమావేశంలో ఉన్నా. విషయం నాకన్నా మీకే బాగా తెలుసు. నేను ఏం కామెంట్ చేసినా.. కామెంట్ చేస్తే దాడి చేస్తారా?. గా బీజేపీ, టీఆర్‌ఎస్ వాళ్లు కవితకు కాల్ చేసారని చెప్పిండు. సీఎం కేసీఆర్ ఇంటిపై కవిత దాడి చేసిందా?. దానికి సమాధానం చెప్పాలి కదా కేసీఆర్‌కి కవిత. రాజకీయాలు, గీజకీయాలు మస్ట్ చేస్తాం కానీ.. దాడి జరిగిన అనంతరం మా అమ్మతో మాట్లాడా. ఆమెను బయపెట్టారట. ఇంట్లో 70 ఏళ్ల తల్లి, 75 ఏళ్ల తండ్రి ఉన్నారు. మహిళా సిబ్బందిని రాయితో ఛాతిలో కొట్టారట. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసారు. దేని కోసం ఇదంతా?. కేసీఆర్‌పై కవిత దాడి చేసిందా అని అడుగుతున్నా' అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు.
'ఇప్పటికే 50 సార్లు చెప్పా.. కవిత నిజామాబాద్ పార్లమెంట్‌లో పోటీ చేస్తారా?. నేను ఏం ఘాటుగా మాట్లాడలే. నిజామాబాద్ చౌరస్తాలో నా వెంబడి పడి ఓడిస్తా అంది. నేను స్వాగతం పలుకుతున్నా. ఇప్పటికన్నా వచ్చి పోటీ చేస్తాదా లేదా మాట మారుస్తదా. కవిత ఇంత రియాక్ట్ అయిందంటే.. ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వరి కావాలె. నాకు ఫోన్ చేప్పింది చాలా సీనియర్.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ ఆఫీస్ బేరర్. సీఎం కేసీఆర్ అందరి ఫోన్లు ట్యాప్ చేస్తడు కదా.. మరి బిడ్డ ఫోన్ కూడా ట్యాప్ చేస్తే నిజం తెలుస్తది కదా?. ఇవ్వని కడాదండి.. నా తల్లిగారిని బయపెట్టించే హక్కు ఎవడిచ్చారండి' అని ఎంపీ అరవింద్ మండిపడ్డారు.
Also Read: నా గురించి ఇంకోసారి మాట్లాడితే.. చెప్పుతో కొడతా! ఎంపీ అరవింద్‌కి కవిత స్ట్రాంగ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.