Joint Pain Relief In 3 Days: చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య రావడం చాలా సాధారణం. అయితే చాలా మందిలో కీళ్ల నొప్పులతో పాటు నడుము నొప్పుల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. చలి గాలి తాగడం వల్ల ఇలాంటి నొప్పులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల కండరాలు దృఢత్వం సంభవించి కీళ్లలో నొప్పి పెరగడం ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పలు రకాల చిట్కాలతో ఈ కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ నివారణలేంటో ఇప్పులు తెలుసుకుందాం..
ఈ చిట్కాలను పాటించండి:
వేడి నీటిలో స్నానం చేయండి:
చలి కాలంలో కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా వేడి నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ వేడి నీటితో స్నానం చేస్తే సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరి ఆర్థరైటిస్ సమస్యలు సులభంగా తగ్గుతాయి. కాబట్టి చలి కాలంలో కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ప్రతి ఒక్కరు వేడి నీటితో స్నానం చేయాల్సి ఉంటుంది.
విటమిన్ డి గల ఆహారాలు తినాల్సి ఉంటుంది:
శీతాకాలంలో మాత్రమే కాకుండా అన్ని కాలాల్లో విటమిన్ డి కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటి ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థరైటిస్ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కాబట్టి కీళ్ల రోగులు తప్పకుండా విటమిన్ డి ఎక్కవగా ఉండే ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని కోసం మీరు ప్రతి రోజూ పాలు, పెరుగు, గుడ్లు తీసుకోవాల్సి ఉంటుంది.
శరీరాన్ని వెచ్చగా ఉంచుకోండి:
ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్నవారు శరీరానికి వెచ్చదనం అందించాల్సి ఉంటుంది. శరీరం వెచ్చగా ఉంటేనే కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా శరీరానికి వెచ్చదనం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా చేయాలి:
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా అరచేతి, మోకాళ్లను దుస్తువులతో కప్పి ఉంచాల్సి ఉంటుంది. దీనితో పాటు పాదాలకు సాక్స్‌లతో కప్పి ఉంచండి. ఇలా చేస్తేనే కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి